పాలిసెట్‌ ప్రశాంతం

ABN , First Publish Date - 2020-09-28T11:45:42+05:30 IST

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్‌-2020 పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 35 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం పరిధిలో 24, టెక్కలి పరిధిలో 11 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉ

పాలిసెట్‌ ప్రశాంతం

ఎచ్చెర్ల/టెక్కలి,సెప్టెంబరు 27: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్‌-2020  పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 35 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం పరిధిలో 24, టెక్కలి పరిధిలో 11 కేంద్రాలను ఏర్పాటుచేశారు.


ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష నిర్వహిం చారు. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్ధులను కేంద్రంలోకి అనుమతించారు. కోవిడ్‌ నిబంధనలు పక్కాగా పాటించారు. విద్యార్థులకు థర్మల్‌ స్ర్కీనిం గ్‌ చేసి ఉష్ణోగ్రతను గుర్తించారు.


చేతులపై శానిటె ౖజ్‌ చేశారు.  శ్రీకాకుళం పరిధిలోని 24 కేంద్రాల్లో 5016 మంది విద్యార్థులకుగాను 4058 మంది హాజరయ్యారు. టెక్కలి పరిధిలోని 11 కేంద్రాల్లో 1740 మంది విద్యార్థులకుగాను 1405 మంది పరీక్ష రాశారు. మొత్తం 35 కేంద్రాల్లో 6756 మందికి గాను..


5463 మంది పరీక్షకు హాజరయ్యారు. 80.86 శాతం విద్యార్థులు హాజరైనట్టు అధికారులు ప్రక టించారు. శ్రీకాకుళం పరిధిలోని కేంద్రాలకు శ్రీకా కుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.రాజేశ్వరి, టెక్కలి పరిధిలోని కేంద్రాలకు ఆమదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.నారాయణరావు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపింది.

Updated Date - 2020-09-28T11:45:42+05:30 IST