చర్మాన్ని గమనిస్తున్నారా!

ABN , First Publish Date - 2021-01-30T20:08:56+05:30 IST

సౌందర్య ఉత్పత్తులు చర్మానికి మెరుపునిస్తాయి. అయితే వాటిలోని రసాయనాల ప్రభావంతో ఒక్కోసారి చర్మం మీద ముడతలు, గీతలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే చర్మం కొన్ని సంకేతాలను ఇస్తుంద ని గ్రహించాలి అంటున్నారు కాస్మెటిక్‌ నిపుణురాలు డాలీ కుమార్‌. ఆమె ఏం చెబుతున్నారంటే...

చర్మాన్ని గమనిస్తున్నారా!

సౌందర్య ఉత్పత్తులు చర్మానికి మెరుపునిస్తాయి. అయితే వాటిలోని రసాయనాల ప్రభావంతో ఒక్కోసారి చర్మం మీద ముడతలు, గీతలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే చర్మం కొన్ని సంకేతాలను ఇస్తుంద ని గ్రహించాలి అంటున్నారు కాస్మెటిక్‌ నిపుణురాలు డాలీ కుమార్‌. ఆమె ఏం చెబుతున్నారంటే... 


పగుళ్లు, గీతలు: చర్మం మీద చిన్న చిన్న ఎర్రని బుగ్గలు ఏర్పడి పగుళ్లు కనిపిస్తున్నాయంటే మీరు ఉపయోగించే సౌందర్య సాధనాల్లో సల్ఫేట్స్‌ ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలి. మాయిశ్చరైజర్‌ లేదా ఫేస్‌వా్‌షలో సోడియం లారైల్‌ సల్ఫేట్‌ మోతాదుకు మించి ఉందని అర్థం. అలాంటప్పుడు సల్ఫేట్స్‌ అధికంగా ఉన్న ఉత్పత్తులను మానేస్తే ఎర్ర బుగ్గలు తగ్గిపోతాయి. 


కొత్త సమస్యలు: కొత్తరకం ఉత్పత్తులు ఉపయోగించిన ప్రతిసారి చర్మం మరింత జిడ్డుగా లేదా పొడిగా మారడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మీరు రోజూ వాడే ఫేస్‌క్రీమ్స్‌తో ఆశించిన ఫలితం కనిపించనప్పుడు కొత్తవి ఎంచుకోవడం సరైనదే. అయితే చర్మం కొత్త ఉత్పత్తులను గ్రహించి, మార్పు కనిపించేదుకు కొంత సమయం వేచి చూడాలి. 


వాతావరణ మార్పులు: అన్ని సీజన్లలో ఒకేరకం సౌందర్య సాధనాలను వాడకూడదు. ప్రతి సీజన్‌ చర్మంపై ఒక్కోలా ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు చలికాలంలో మాయిశ్చరైజింగ్‌ క్రీమ్స్‌ అవసరం ఎక్కువ. వేసవిలో అయితే తేలికపాటి, వాటర్‌బేస్డ్‌ మాయిశ్చరైజర్‌ వాడితే మంచిది. 


వ్యక్తిగత శుభ్రత: చర్మ సౌందర్యంలో చేతుల శుభ్రత ముఖ్యమే. ఎందుకంటే చేతుల్లోని మురికి కారణంగా మొటిమలు ఏర్పడే అవకాశముంది. అందుకే చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి.


పిల్లో కవర్లు: ముఖం మీద దద్దుర్లు, మచ్చలకు పిల్లో కవర్లు కూడా కారణమవుతాయి. అందుకే మెత్తని పిల్లో కవర్లు వాడాలి. వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.




Read more