స్కిన్‌కేర్‌ ఎలా ఉండాలంటే...

ABN , First Publish Date - 2020-02-26T05:30:00+05:30 IST

చర్మం తాజాగా, కాంతిమంతంగా కనిపించేందుకు పలు రకాల సౌందర్య ఉత్పత్తులు ఉన్నాయి. అయితే ‘ఒకటి లేదా రెండు రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ వాడినా కూడా మెరుగైన ఫలితం ఉంటుంది’...

స్కిన్‌కేర్‌ ఎలా ఉండాలంటే...

చర్మం తాజాగా, కాంతిమంతంగా కనిపించేందుకు పలు రకాల సౌందర్య ఉత్పత్తులు ఉన్నాయి. అయితే ‘ఒకటి లేదా రెండు రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ వాడినా కూడా మెరుగైన ఫలితం ఉంటుంది’ అంటున్నారు చర్మనిపుణులు. స్కిన్‌కేర్‌పై అవగాహనతో   అందాన్నిపెంచుకోవడం సులువే అంటున్నారు. 


  • ఏ సౌందర్య సాధనం అయినా వెంటనే ఫలితం ఇవ్వదు. దాంతో చాలామంది వెంటవెంటనే బ్యూటీ క్రీమ్స్‌ మారుస్తూనే ఉంటారు. అయితే చర్మం బ్యూటీ ప్రొడక్ట్స్‌కు నెల తరవాత స్పందించడం మొదలెడుతుంది అందువల్ల మూడు నెలల పాటు ఒకే స్కిన్‌కేర్‌ పాటించాలి. ఈ సమయంలో చర్మం మూడు పొరల మీద బ్యూటీ క్రీమ్‌ ప్రభావం ఏ మేర ఉంటుందో తెలుస్తుంది. అప్పటికీ ఏ మార్పు లేకపోతే వేరే క్రీమ్‌ వాడాలని సూచిస్తున్నారు చర్మ, సౌందర్య నిపుణులు. 
  • డల్‌నెస్‌ తగ్గేందుకు, హైడ్రేషన్‌, మృదువైన చర్మం కోసం వాడే బ్యూటీ ఉత్పత్తులు తక్కువ సమయంలోనే ఫలితాన్నిస్తాయి. అయితే చర్మం మీది ముడతలు, గీతలు, మొటిమల మచ్చలు తొలగేందుకు ఎక్కువ సమయం పడుతుంది. 
  • రకరకాల చర్మ సౌందర్య సాధనాలు వాడే బదులు ఒకటి లేదా రెండు ఉత్పత్తులు వాడితే మెరుగైన ఫలితం ఉంటుంది. కొత్త రకం క్రీమ్‌ వాడే ముందు అది చర్మతత్వానికి సరిపోతుందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు చర్మ నిపుణులు.

Updated Date - 2020-02-26T05:30:00+05:30 IST