నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-04-17T05:22:38+05:30 IST

విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యా లయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు.

నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి

దివాన్‌చెరువు, ఏప్రిల్‌ 16: విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యా లయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. విద్యార్థుల కోసం వర్సిటీ లో ఏకలవ్య కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను శుక్రవారం ఆయన ఆవిష్కరించి వివరాలను తెలిపారు. ఉభయగోదా వరి జిల్లాల్లో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు విశ్వవిద్యాలయంలో ఎక్కువ మంది ఉన్నారన్నారు. వారికి స్పోకెన్‌ ఇంగ్లిషు, కంప్యూటర్‌లలో  నైపుణ్యాలను  వృద్ధి చేసేందుకు ఏకలవ్య కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఇందులో మూడు వారాల శిక్షణ ఇచ్చిన ఆనంతరం వారి ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్లు ఇస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ వి.పెర్సిస్‌ కన్వీనర్‌గాను, కోఆర్డినేటర్లుగా విభాగాధ్యాపకులు బి.బి.అహ్మద్‌, అలీబాబా, డి.దాసు వ్యవహరి స్తారన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య బి.అశోక్‌, ఈసీ సభ్యులు బి.జగన్మో హనరెడ్డి, ప్రిన్సిపాల్స్‌ కె.రమణేశ్వరి, కె.సుబ్బారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:22:38+05:30 IST