Advertisement
Advertisement
Abn logo
Advertisement

నైపుణ్యం అదరహో..!

రెండో రోజూ కొనసాగిన ఇండియా స్కిల్‌ పోటీలు  

11 వేదికల్లో  నిర్వహణ 450 మంది హాజరు

విభిన్న రంగాలకు సంబంధించి 52 అంశాల్లో సౌత్‌జోన్‌ స్థాయి పోటీలు

విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): దేశంలోని యువత నైపుణ్యాలకు కొదవ లేదు. దానిని గుర్తించడంతో పాటు ప్రోత్సాహాన్ని అందిస్తే అద్భుతాలను సృష్టించడానికి   యువత సిద్ధంగా ఉంది. యువ నైపుణ్యాలను గుర్తించే ప్రక్రియకు తెర లేపింది ఇండియా స్కిల్స్‌ సంస్థ.   కొన్నేళ్లుగా నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, జోనల్‌, జాతీయస్థాయిలో నైపుణ్య పోటీలను నిర్వహిస్తూ.. విభిన్న రంగాల్లో నైపుణ్యాన్ని కనబరుస్తున్న యువతను ప్రో త్సహిస్తోంది. విశాఖ వేదికగా రెండు రోజులుగా నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల ఇండియా స్కిల్స్‌-2021 సౌత్‌జోన్‌ పోటీలను నిర్వహిస్తోంది.  ఇందులో భాగంగా  గురువారం నగర పరిధిలోని 11 వేదికల్లో 52 అంశాల్లో పోటీలను ని ర్వహించారు. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 450 మంది పాల్గొని తమలోని నైపుణ్యాలను ప్రదర్శించారు. ఆయా వేదికల్లో జరిగిన పోటీలను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తోపాటు ఇండియా స్కిల్స్‌ సంస్థకు చెందిన ప్రతినిధులు పర్యవేక్షించారు. 

ఇండియా స్కిల్స్‌-2021 ప్రాంతీయ పోటీలు ఈనెల ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు జరగనున్నాయి.  ఆంధ్రప్రదేశ్‌ నుంచి 74 మంది, కర్ణాటక నుంచి 68 మంది, కేరల నుంచి 78 మంది, తమిళనాడు నుంచి 84 మంది, తెలంగాణ నుంచి 34 మంది, ఇతరులు మరో 100 మంది పాల్గొన్నారు. ప్రధానంగా విజువల్‌ మర్చండైజింగ్‌, బెబ్‌ టెక్నాలజీస్‌, ఇటుకల తయారీ, బేకరీ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, మొబైల్‌ రోబోటిక్స్‌, 3డీ డిజిటల్‌ గేమ్‌ ఆర్ట్‌ వంటి 52 అంశాలలో స్కిల్‌ కాంపిటేషన్స్‌ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను సౌత్‌జోన్‌ పోటీలకు ఎంపిక చేశారు.  ఇక్కడి విజేతలను త్వరలో జరగనున్న ప్రపంచ స్కిల్స్‌ పోటీలకు పంపిస్తారు. 


సత్తా చాటుతున్నారు.. 

ఇండియా స్కిల్స్‌ పోటీలకు ఉన్నత చదువుల చదవాలన్న నిబంధన లేదు. వారు పేర్కొన్న అంశాల్లో నైపుణ్యం ఉంటే చాలు.. పోటీలకు వచ్చిన పలువురు విద్యార్థులు తమలోని ప్రతిభా, పాటవాలను, నైపుణ్యాలతో  అదరగొడుతున్నారు. విభిన్న ఆలోచనలతో రూపొందిన మొబైల్‌ రోబోటిక్స్‌ ప్రాజెక్ట్‌లు,  నైపుణ్యాన్ని ఆవిష్కరించే జ్వూవెలరీ కాంపిటేషన్స్‌, మక్కువగా తీర్చిదిద్దుకునే ల్యాండ్‌ స్కేప్‌ గార్డెనింగ్‌.. ఇలా విభిన్న అంశాల్లో యువత చూపిస్తున్న నైపుణ్యం  ఆకట్టుకుంటోంది. సాంకేతిక అంశాల్లో వీరి ప్రతిభను చూసి.. నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. 


నైపుణ్య ప్రదర్శనకు గొప్ప అవకాశం.. 

యువతలో ప్రతిభా, పాటవాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు గొప్ప అవకాశంగా ఈ పోటీలను భావించాలి. జాతీయస్థాయిలో  పోటీపడడం ద్వారా ఇతర ప్రాంతాల్లోని యువత ఆలోచనలు, వారి నైపుణ్యాలు పట్ల అవగాహన కలుగుతుంది. తద్వారా భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణల కు అవకాశముంటుంది. ఎలక్ర్టానిక్స్‌ విభాగంలో నిర్వహించిన పోటీలకు ఎనిమిదిమంది ఎంపికయ్యారు. వీరిలో ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి ఇద్దరు చొప్పున ఉన్నారు. వీరికి ఇండిస్ర్టియల్‌ కంట్రోల్‌, ఎలక్ర్టానిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఇన్‌స్టాలేషన్‌, రిఫ్రిజేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌, మొబైల్‌ రోబోటిక్స్‌, ఐటీ నెట్వర్క్‌ అండ్‌ అడ్మినిస్ర్టేషన్‌ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి.  

 


Advertisement
Advertisement