నిరుద్యోగాన్ని అంతం చేయడం కోసం వారాంతాల్లో శిక్షణ

ABN , First Publish Date - 2022-04-16T18:55:55+05:30 IST

బిహార్‌లో నిరుద్యోగాన్ని అంతం చేయడం కోసం ఇంజినీరింగ్

నిరుద్యోగాన్ని అంతం చేయడం కోసం వారాంతాల్లో శిక్షణ

పాట్నా : బిహార్‌లో నిరుద్యోగాన్ని అంతం చేయడం కోసం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఎస్‌కే ఝా నడుం బిగించారు. పాట్నా విశ్వవిద్యాలయం సమీపంలోని ఘాట్‌లో శని, ఆదివారాల్లో వేలాది మందికి శిక్షణ ఇస్తున్నారు. రైల్వేలు, షార్ట్ సర్వీస్ కమిషన్ వంటివాటిలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు ప్రయోజనం పొందుతున్నారు. ఝా ఎటువంటి రుసుము వసూలు చేయకుండా ఉచితంగా సేవలందిస్తుండటం విశేషం. 


ఎస్‌కే ఝా మీడియాతో మాట్లాడుతూ, తాము ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 6 గంటలకు పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ పరీక్షలకు దాదాపు 14 వేల మంది ఉద్యోగార్థులు హాజరవుతున్నారని చెప్పారు. తాను రెండు నెలల నుంచి ఈ విధంగా ఉచిత శిక్షణ ఇస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో తన బృందం ఈ ఉద్యోగార్థులకు సేవలందిస్తోందన్నారు. నిరుద్యోగాన్ని అంతం చేసే దిశగా తాము ప్రతి రోజూ ఓ ముందడుగు వేస్తున్నామని చెప్పారు. ఈ ఉద్యోగార్థులంతా సామాన్య నేపథ్యంగలవారేనని చెప్పారు. దాదాపు 35 మంది వారంలోని అన్ని రోజులూ టెస్ట్ పేపర్స్ కోసం శ్రమిస్తున్నారన్నారు. 



Updated Date - 2022-04-16T18:55:55+05:30 IST