మార్మగోవా సముద్రంలోనే Mumbai-Goa cruise ship

ABN , First Publish Date - 2022-01-04T13:14:27+05:30 IST

ముంబై-గోవా కోర్డెలియా క్రూయిజ్ షిప్ లో 66 మంది ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ అని రావడంతో విహార నౌకను మార్మగోవా పోర్టు ట్రస్టులోకి అనుమతించలేదు....

మార్మగోవా సముద్రంలోనే Mumbai-Goa cruise ship

కరోనా రోగులు దిగేందుకు అనుమతి నిరాకరణ

పనాజీ (గోవా): ముంబై-గోవా కోర్డెలియా క్రూయిజ్ షిప్ లో 66 మంది ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ అని రావడంతో విహార నౌకను మార్మగోవా పోర్టు ట్రస్టులోకి అనుమతించలేదు. విహార నౌకలో కొవిడ్ సోకిన ప్రయాణికులను షిప్ నుంచి కింద దిగడానికి అనుమతించబోమని గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే తెలిపారు.క్రూయిజ్ షిప్ లో 2వేల మంది ఉండగా అందులో 66 మందికి కరోనా సోకడంతో వారిని షిప్‌లోనే ఉంచారు.కరోనా వ్యాప్తి భయంతో క్రూయిజ్ షిప్‌ను గోవా పోర్టు ట్రస్టులోకి అనుమతించమని అధికారులు చెప్పారు. విహార నౌకలో 66 కరోనా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ఈ నెల 3వతేదీ నుంచి 5వతేదీ వరకు ఓడల రాకపోకలను నిలిపివేయాలని గోవా పోర్టు ట్రస్టు నిర్ణయించింది. 


క్రూయిజ్ షిప్ లో ప్రయాణికులకు కరోనా సోకిన విషయాన్ని ఆరోగ్యశాఖ అధికారులు ముంబై పోర్టు ట్రస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. క్రూయిజ్ షిప్‌లోకి పీపీఈ కిట్లు ధరించిన ప్రత్యేక వైద్యబృందాన్ని పంపించామని వారు కొవిడ్ పరీక్షలు చేసి, రోగులకు చికిత్స అందిస్తున్నారని మంత్రి విశ్వజిత్ రాణే చెప్పారు. 


Updated Date - 2022-01-04T13:14:27+05:30 IST