ఫైన్‌ఆర్ట్స్‌ పాఠశాలలో ఆరోతరగతి ప్రవేశాలు

ABN , First Publish Date - 2022-06-24T20:55:45+05:30 IST

హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ - ఫైన్‌ ఆర్ట్స్‌ పాఠశాలలో ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మేడ్చల్‌ జిల్లాలోని మల్కాజ్‌గిరి..

ఫైన్‌ఆర్ట్స్‌ పాఠశాలలో ఆరోతరగతి ప్రవేశాలు

హైదరాబాద్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(Telangana Institute of Social Welfare Gurukul Schools) - ఫైన్‌ ఆర్ట్స్‌ పాఠశాల(School of Fine Arts)లో ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మేడ్చల్‌ జిల్లాలోని మల్కాజ్‌గిరి @ ఏదులాబాద్‌ - ఘట్‌కేసర్‌లో ఈ పాఠశాల ఉంది. ఇక్కడ అకడమిక్‌ బోధనతోపాటు ఫైన్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. ఈ పాఠశాలలో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఫైన్‌ ఆర్ట్స్‌కు సంబంధించిన స్కిల్‌ టెస్ట్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు.  విద్యార్థులు అడ్మిషన్‌ సమయంలో టీసీ/రికార్డ్‌ షీట్‌, స్టడీ సర్టిఫికెట్‌; అయిదోతరగతి ప్రోగ్రెస్‌ కార్డ్‌/మార్క్స్‌ షీట్‌; ఆధార్‌ కార్డ్‌; కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు; అయిదు ఫొటోలు; మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ సబ్మిట్‌ చేయాలి.


ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగాలు: కర్ణాటిక్‌, హిందుస్తానీ, వయోలిన్‌, మృదంగం, తబలా, కీబోర్డ్‌, గిటార్‌, కూచిపూడి, కథక్‌, పెయింటింగ్‌ అండ్‌ డ్రాయింగ్‌

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి అయిదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు మాధ్యమంలో చదివినవారు కూడా అర్హులే. వయసు ఆగస్టు 31 నాటికి జనరల్‌, మైనారిటీ, బీసీ విద్యార్థులకు 12 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 14 ఏళ్లు మించకూడదు. కుటుంబ వార్షికాదాయం పట్టణాల్లో చదివినవారికి రూ.2,00,000; గ్రామీణ విద్యార్థులకు రూ.1,50,000 మించకూడదు.   


కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ వివరాలు: పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లీష్‌, తెలుగు, మేథ్స్‌, మెంటల్‌ ఎబిలిటీ, ఎన్విరాన్‌మెంటల్‌/ జనరల్‌ సైన్స్‌ సబ్జెక్ట్‌ల నుంచి ఒక్కోదానిలో 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ అయిదోతరగతి స్థాయిలోనే ఉంటాయి. విద్యార్థులు సమాధానాలను ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు 100. ప్రశ్నపత్రం ఆంగ్లమాధ్యమంలో మాత్రమే ఉంటుంది. స్కిల్‌ టెస్ట్‌కు 50 మార్కులు నిర్దేశించారు. ఇందులో విద్యార్థి ఎంచుకొన్న కళకు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.100

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 28

హాల్‌ టికెట్స్‌ డౌన్‌లోడింగ్‌: జూన్‌ 29 నుంచి

ఎంట్రెన్స్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ తేదీ: జూలై 3

ఫలితాలు విడుదల: జూలై 9

అడ్మిషన్‌ ప్రక్రియ: జూలై 11న

వెబ్‌సైట్‌: www.tswreis.in



Updated Date - 2022-06-24T20:55:45+05:30 IST