16 మంది భారత నావికాదళం శిక్షకులకు కరోనా వైరస్

ABN , First Publish Date - 2020-06-06T14:04:07+05:30 IST

భారత నావికాదళం శిక్షకులు 16 మందికి కరోనా వైరస్ సోకింది....

16 మంది భారత నావికాదళం శిక్షకులకు కరోనా వైరస్

అహ్మదాబాద్ (గుజరాత్): భారత నావికాదళం శిక్షకులు 16 మందికి కరోనా వైరస్ సోకింది. గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ సముద్రతీరంలోని భారత నావికాదళంలో శిక్షణ పొందుతున్న 16 మంది నావికులకు కరోనా సోకడంతో వారిని జాంనగర్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. పోరుబందర్ ఓడరేవు నగరంలో మిలటరీ ఆసుపత్రి లేకపోవడంతో కరోనా బాధితులను జాంనగర్ మిలటరీ ఆసుపత్రికి తరలించామని రక్షణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి పునీత్ చద్దా చెప్పారు. మొదట పోరుబందర్ నావికాదళ కేంద్రంలో శిక్షణ పొందుతున్న 8 మంది నావికులకు కరోనా వచ్చింది. అనంతరం వారిని జాంనగర్ మిలటరీ ఆసుపత్రికి తరలించాక, ఈ నావికాదళంలో మరికొందరికి కరోనా పరీక్షలు చేశారు. దీంతో మరో 8 మంది నావికులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వారిని కూడా మిలటరీ ఆసుపత్రికి తరలించారు. దీంతో నావికాదళంలోని మిగిలిన ఉద్యోగులను కూడా ముందు జాగ్రత్తచర్యగా వారిని హోంక్వారంటైన్ చేశారు. ఏప్రిల్ నెలలో వడోదర మిలటరీ స్టేషనులో నలుగురు సైనికులకు కరోనా సోకింది. 

Updated Date - 2020-06-06T14:04:07+05:30 IST