ఆరేళ్ల విద్యార్థిని నిజాయతీ

ABN , First Publish Date - 2022-04-03T13:01:25+05:30 IST

తరగతి గదిలో లభించిన రూ.50 నోటును ఉపాధ్యాయురాలికి అందజేసిన ఆరేళ్ల విద్యార్థిని నిజాయతీని ప్రశంసిస్తూ ఉపాధ్యాయులు ఆ చిన్నారిని ఒకరోజు

ఆరేళ్ల విద్యార్థిని నిజాయతీ

                 - ఒకరోజు హెచ్‌ఎంగా గౌరవించిన ఉపాధ్యాయులు


పెరంబూర్‌(చెన్నై): తరగతి గదిలో లభించిన రూ.50 నోటును ఉపాధ్యాయురాలికి అందజేసిన ఆరేళ్ల విద్యార్థిని నిజాయతీని ప్రశంసిస్తూ ఉపాధ్యాయులు ఆ చిన్నారిని ఒకరోజు ప్రధానోపాధ్యాయుడి స్థానంలో కూర్చోబెట్టి ప్రోత్సహించారు. శివగంగ జిల్లా మానామధురై బర్మా కాలనీలోని యూనియన్‌ పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉదయం 1వ తరగతి చదువుతున్న దీప తరగతి గదికి వచ్చింది. ఆ సమయంలో తరగతి గదిలో లభించిన రూ.50 నగదును ఉపాధ్యాయురాలు రాజ్యలక్ష్మికి అందజేసింది. గురువారం తన బ్యాగులో కనిపించకుండా పోయిన డబ్బుగా గుర్తించిన ఆమె దీప నిజాయతీని అభినందించింది. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జ్ఞానశేఖరన్‌ దీపను అభినందించడంతో పాటు ఆమె నిజాయతీ పలువురికి స్ఫూర్తినిచ్చేలా తన సీటులో ఆమెను కూర్చోబెట్టారు. సాయంత్రం వరకు దీప ఈ సీటులో కూర్చొని హెచ్‌ఎంగా వ్యవహరించారు.

Updated Date - 2022-04-03T13:01:25+05:30 IST