ఆరు బయటే విద్యార్థుల సైకిళ్లు

ABN , First Publish Date - 2022-07-28T05:29:26+05:30 IST

గార, సతివాడ, అంపోలు, కొర్ని, శ్రీకూర్మం, కళింగపట్నం, వమరవల్లి, బందరువానిపేట ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు సైకిళ్లు పెట్టుకో వడానికి షెడ్లు కరువయ్యాయి.

ఆరు బయటే విద్యార్థుల సైకిళ్లు
గార హైస్కూల్‌ వద్ద ఆరుబయట ఉన్న విద్యార్థుల సైకిళ్లు


 ఎండావానకు పాడవుతున్న వైనం
గార, జూలై 27:
గార, సతివాడ, అంపోలు, కొర్ని, శ్రీకూర్మం, కళింగపట్నం, వమరవల్లి, బందరువానిపేట ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు సైకిళ్లు పెట్టుకో వడానికి షెడ్లు కరువయ్యాయి. దీంతో సైకిళ్లను ఆరుబయటే పెడుతుండడంతో అవి ఎండకు ఎండి వాన తడిసి పాడవుతున్నాయి. మండలంలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో సుమారు 5 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి విద్యార్థులు సైకిళ్లపై పాఠశాలలకు వెళ్లి వస్తుంటారు. గత ప్రభుత్వం బాలికల సౌకర్యార్థం సైకిళ్లను మంజూరు చేసింది. ఇలా ప్రతి పాఠశాల వద్ద వందలాది సైకిళ్లు ఎండావానలకు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. నాడు- నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి పరుస్తున్న నేపథ్యంలో ఈ ఉన్నత పాఠశాలల వద్ద విద్యార్థులు సైకిళ్లను భద్రపరచుకోవడానికి అవసరమైన షెడ్‌లను ఏర్పాటు చేయాలని  వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

 

Updated Date - 2022-07-28T05:29:26+05:30 IST