ఆర్నెల్ల చిన్నారి నరబలి

ABN , First Publish Date - 2021-12-18T17:04:06+05:30 IST

తంజావూరు జిల్లాలో మూఢ నమ్మకంతో ఆర్నెల్ల చిన్నారిని నరబలి ఇచ్చిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని సేతుపావసత్రం ప్రాంతానికి చెందిన నజ్రుద్దీన్‌ (32) అనే

ఆర్నెల్ల చిన్నారి నరబలి

అడయార్‌(చెన్నై): తంజావూరు జిల్లాలో మూఢ నమ్మకంతో ఆర్నెల్ల చిన్నారిని నరబలి ఇచ్చిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని సేతుపావసత్రం ప్రాంతానికి చెందిన నజ్రుద్దీన్‌ (32) అనే మత్స్య కార్మికుడికి భార్య షాలికా (30), ఇద్దరు కుమారులు, షాజరా అనే ఆర్నెల్ల కుమార్తె ఉంది. అయితే, రెండు రోజుల క్రితం ఈ చిన్నారి ఇంటిముందు నీటి తొట్టిలో విగతజీవిగా కనిపించింది. ఆ తర్వాత ఆ చిన్నారికి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే, ఆర్నెల్ల పసిపాప నీటి తొట్టిలో ఎలా పండిందన్న సందేహం ఇరుగుపొరుగువారికి వచ్చింది. ఈ విషయం పేరావూరణి పోలీసులకు చేరింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నజ్రుద్దీన్‌, షాలికా దంపతులను విచారించగా అసలు విషయం వెల్లడైంది. నజ్రుద్దీన్‌ పిన్ని షర్మిలాబేగం (48) భర్త అజారుద్దీన్‌ గత కొదిరోజులుగా అనారోగ్యంతో ఉన్నాడు. దీంతో ఓ మంత్ర వాదిని సంప్రదించగా నరబలి ఇస్తే అంతా చక్కబడుతుందని సలహా ఇచ్చాడు. దీంతో షాలికా ఆర్నెల్ల కుమార్తెను షర్మిలా బేగం నీటి తొట్టిలో పడేసి చంపేసినట్టు విచారణలో వెల్లడైంది. అలాగే, సమాచారాన్ని పోలీసులకు చెప్పకుండా అంత్యక్రియలు నిర్వహించినందుకు నజ్రుద్దీన్‌, ఈయన సోదరుడు సయ్యద్‌ ఇబ్రహీం, షర్మిలా బేగంను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-12-18T17:04:06+05:30 IST