Abn logo
Aug 6 2021 @ 17:00PM

అలస్కాలో ఘోరం.. విమానం కుప్పకూలి..

అలస్కా : అలస్కాలో సందర్శనా విమానం కుప్పకూలిన దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. కెట్ చికాన్ పట్టణ సమీపంలోని నీటిలో విమానం కుప్పకూలింది.ఈ విమాన ప్రమాదంలో ఆరుగురు మరణించారని యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది. మృతుల్లో ఐదుగురు ప్రయాణికులు, ఒక పైలెట్ ఉన్నారని సౌత్ ఈస్ట్ ఏవియేషన్ సంస్థ తెలిపింది. విమానం కూలిన సమయంలో ఆ ప్రాంతంలో పొగమంచుతోపాటు తేలికపాటివర్షం కురుస్తోందని కోస్ట్ గార్డు అధికారులు చెప్పారు.విమానం నీళ్లలో కూలిపోవడంతో ఎవరైనా బయటపడ్డారా అని గజఈతగాళ్లతో గాలించినా ప్రయోజనం లేదు.ఆగ్నేయ అలస్కాలో సందర్శనా విమానం సిట్కా కోస్ట్ గార్డ్ ఎయిర్ స్టేషన్ నుంచి వెళ్లిన జేహాక్ హెలికాప్టర్ సిబ్బంది విమానం కూలిన ప్రాంతంలో శిథిలాలను కనుగొంది.


అమెరికా నగరాల్లోమరిన్ని...