bus falls into river: నదిలో పడిన బస్సు...ఆరుగురు ఐటీబీపీ జవాన్ల మృతి

ABN , First Publish Date - 2022-08-16T18:26:29+05:30 IST

జమ్మూకశ్మీరులోని పహల్ గాం( Pahalgam) జిల్లాలో ఐటీబీపీ జవాన్లతో(ITBP jawans) వెళుతున్న బస్సు ప్రమాద వశాత్తూ నదిలో పడిపోయింది....

bus falls into river: నదిలో పడిన బస్సు...ఆరుగురు ఐటీబీపీ జవాన్ల మృతి

హల్‌గాం(జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని పహల్ గాం( Pahalgam) జిల్లాలో ఐటీబీపీ జవాన్లతో(ITBP jawans) వెళుతున్న బస్సు ప్రమాద వశాత్తూ నదిలో పడిపోయింది.(falls into river) ఈ దుర్ఘటనలో ఆరుగురు ఇండో టిబెటన్ బార్టర్ పోలీసులు మరణించారు.37 మంది ఐటీబీపీ జవాన్లు, ఇద్దరు జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి మొత్తం 39 మంది బస్సు ఎక్కారు. ఈ బస్సు చందన్ వారీ వద్ద నదిలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 30మంది ఐటీబీపీ జవాన్లు గాయపడ్డారు.


 క్షతగాత్రులకు ప్రథమచికిత్స చేసి వారిని చికిత్స కోసం అనంత్ నాగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన మరో ముగ్గురిని పహల్ గాంలోని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. 



Updated Date - 2022-08-16T18:26:29+05:30 IST