కొత్త బ్యాంకుల ఏర్పాటు దరఖాస్తులు... ఆరింటిని తిరస్కరించిన RBI

ABN , First Publish Date - 2022-05-18T00:11:42+05:30 IST

కొత్త బ్యాంకుల ఏర్పాటుకుగాను అందిన దరఖాస్తుల్లో ఆరింటిని RBI తిరస్కరించింది.

కొత్త బ్యాంకుల ఏర్పాటు దరఖాస్తులు...  ఆరింటిని తిరస్కరించిన RBI

ముంబై : కొత్త బ్యాంకుల ఏర్పాటుకుగాను అందిన దరఖాస్తుల్లో ఆరింటిని RBI తిరస్కరించింది. లైసెన్స్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఆరు దరఖాస్తులు ప్రమాణాలకు తగ్గట్లుగా లేనందున RBI వీటిని తిరస్కరించింది. కొత్త బ్యాంకుల ఏర్పాటు కోసం మొత్తం ఎనిమిది దరఖాస్తులు RBI కి అందాయి. ట్యాప్‌లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసే మార్గదర్శకాల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మొత్తం 8 దరఖాస్తులను అందుకుంది. అన్ని రకాల సేవలను అందించే సార్వత్రిక బ్యాంకుల ఏర్పాటుకు నాలుగు దరఖాస్తులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్‌ఎఫ్‌బి) కోసం నాలుగు దరఖాస్తులు ఇందులో ఉన్నాయి. 


యుఎఇ ఎక్స్ఛేంజ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ది రిప్యాట్రియట్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ బ్యాంక్ లిమిటెడ్ (రెప్కో బ్యాంక్), చైతన్య ఇండియన్ ఫిన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, పంకజ్ వైశ్య, యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం ఆన్ ట్యాప్ లైసెన్సింగ్ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసుకున్నారు. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్ 2019 సెప్టెంబర్‌లో 739 కోట్ల రూపాయల పెట్టుబడితో చైతన్యలో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నారు. బన్సాల్ చైతన్య మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఉన్నారు. కాగా... తమకు అందిన దరఖాస్తుల్లో ఆరు దరఖాస్తులను తిరస్కరించినట్లు ఆర్బీఐ వర్గాలు పేర్కొన్నాయి. 

Updated Date - 2022-05-18T00:11:42+05:30 IST