హగ్‌లు.. ముద్దులే ముఖ్యం.. ఆ బాబా లీలలెన్నో..!

ABN , First Publish Date - 2021-06-21T18:57:31+05:30 IST

తనను తాను కలియుగ శ్రీవేంకటేశ్వర స్వామిగా ప్రకటించుకుని

హగ్‌లు.. ముద్దులే ముఖ్యం.. ఆ బాబా లీలలెన్నో..!

చెన్నై/అడయార్‌ : తనను తాను కలియుగ శ్రీవేంకటేశ్వర స్వామిగా ప్రకటించుకుని, ఓ పాఠశాలను నడుపుతూ వచ్చిన శివశంకర్‌బాబా ప్రవర్తన ను కొందరు పూర్వ విద్యార్థినులు వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ పూర్వ విద్యా ర్థిని ఓ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక సంచలన విష యాలను వెల్లడించింది. ముఖ్యంగా, శివశంకర్‌ బాబా సారథ్యంలో నడిచే పాఠశాల ఎంతో ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్య వుంటుందని, ఈ ప్రాంగణంలోనే అనేక ఆలయాలు కూడా వున్నాయని, ఆ కారణంగానే ఈ పాఠశాలకు డిమాండ్‌ ఎక్కువగా వుందని ఆమె పేర్కొంది.


పైగా శివశంకర్‌ బాబాను ఓ దేవుడిగా అనేక మంది తల్లిదండ్రులు భావిస్తుంటారని, అందుకే శివశంకర్‌ బాబా చేసే పనులకు అడ్డు చెప్పరాదని తమ పిల్లలకు చెబుతుంటారని, దీన్ని అలుసుగా తీసుకున్న శివశంకర్‌బాబా మరింతగా రెచ్చిపోయారని, తరగతి గదిలోకి వచ్చి పాఠాన్ని బోధిస్తానని చెప్పి.. బ్లాక్‌బోర్డుపై అసభ్యకరమైన బొమ్మలు వేసి విద్యార్థులకు ప్రశ్నలు సంధించేవారని ఆమె తెలిపింది. అలాగే, ఈ పాఠశాలలో గుడ్‌మార్నింగ్‌, గుడ్‌ఈవినింగ్‌ వంటి పదాలు నిషేధమని, కేవలం కౌగిలించుకోవడం, ముద్దుల రూపంలో వీటిని చెప్పాలని, ఇలాంటివి చేసేందుకు ఇష్టపడని విద్యార్థినులకు మార్కులు తక్కువగా వేస్తారని, అలాంటి వారిలో తాను ఒకరినని ఆ విద్యార్థిని వివరించింది.

Updated Date - 2021-06-21T18:57:31+05:30 IST