Abn logo
Jul 4 2020 @ 12:41PM

తెలుగులోకి మరో సూపర్‌హిట్ సినిమా?

మలయాళంలో విజయవంతమైన `కప్పేలా` సినిమా రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ దక్కించుకుందట. గతంలో ఈ సినిమా `ప్రేమమ్`ను తెలుగులోకి రీమేక్ చేసి విజయం సాధించింది. ఇటీవల `ఆయ్యప్పనుమ్ కోషియమ్` హక్కులను కూడా చేజిక్కించుకుంది. 


రవితేజ, రానా హీరోలుగా ఈ సినిమాను తెరకెక్కించబోతోంది. లవ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కి విజయం సాధించిన `కప్పేలా` హక్కులను కూడా సితార సంస్థ దక్కించుకుందట. ఇద్దరు హీరోలతో ఈ సినిమాను తెలుగులో నిర్మించబోతోందట. ఓ యువ దర్శకుడు ఈ రీమేక్ సినిమాను తెరకెక్కించబోతున్నాడట. 


Advertisement
Advertisement
Advertisement