కొప్పర్తిలో పరిశ్రమ ఏర్పాటుకు స్థల పరిశీలన

ABN , First Publish Date - 2020-09-18T17:56:15+05:30 IST

కొప్పర్తిలో ఎలకా్ట్రనిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ పరిశ్రమ ఏర్పాటుకు ఏపీఐసీసీ..

కొప్పర్తిలో పరిశ్రమ ఏర్పాటుకు స్థల పరిశీలన

సీకేదిన్నె(కడప): కొప్పర్తిలో ఎలకా్ట్రనిక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ పరిశ్రమ ఏర్పాటుకు ఏపీఐసీసీ భూములకు సంబంధించి 503 ఎకరాలను సబ్‌ కలెక్టరు ఫృద్వీతేజ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించి పరిశ్రమ ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందన్నారు. కడపకు దగ్గరలో ఉండడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని, ఏర్పాటు చేసిన కొద్దికాలంలోనే అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పర్రిశమ ఏర్పాటు అయితే అనేక మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు మహేశ్వర్‌రెడ్డి, పలువురు అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-09-18T17:56:15+05:30 IST