Abn logo
May 9 2021 @ 00:02AM

తాత్కాలిక షెడ్ల స్థలం పరిశీలన

కర్నూలు(కలెక్టరేట్‌), మే 8: నగర శివారులోని టిడ్కో హౌసింగ్‌ కాలనీ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ వద్ద అన్ని వసతులతో కూడిన తాత్కాలిక జెర్మన్‌ షెడ్ల ఏర్పాటు స్థలాన్ని కలెక్టర్‌ వీరపాం డియన్‌, జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు శనివారం పరిశీలించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జెర్మన్‌ హేంగర్ల ద్వారా తాత్కాలిక షెడ్లు వేసి.. వంద పడకలు ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ డీఈని కలెక్టర్‌ ఆదేశించారు. జెర్మన్‌ షెడ్స్‌లో ఏసీ, శానిటేషన్‌, ఆక్సిజన్‌ బెడ్స్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. బీసీ కార్పొరేషన్‌ ఈడీ శిరీష తదితరులు పాల్గొన్నారు.

Advertisement