నీరా ప్రాజెక్టుకు స్థల పరిశీలన

ABN , First Publish Date - 2022-07-04T03:58:52+05:30 IST

చారకొండ మండల కేంద్రంలో నీరా ప్రాజెక్టు ఏర్పాటుకు సర్పంచ్‌ గుండె విజేందర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ జెల్ల గురువయ్యగౌడ్‌తో కలిసి ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ మహబూబ్‌నగర్‌ డివిజన్‌ అధికారి దత్తురాజుగౌడ్‌, ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రంగారెడ్డి డివిజన్‌ అధికారి ఆదివారం స్థలాన్ని పరిశీలించారు.

నీరా ప్రాజెక్టుకు స్థల పరిశీలన
స్థలాన్ని పరిశీలిస్తున్న ఎక్సైజ్‌ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు

చారకొండ, జూలై 3:  చారకొండ మండల కేంద్రంలో నీరా ప్రాజెక్టు ఏర్పాటుకు సర్పంచ్‌ గుండె విజేందర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ జెల్ల గురువయ్యగౌడ్‌తో కలిసి ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ మహబూబ్‌నగర్‌ డివిజన్‌ అధికారి దత్తురాజుగౌడ్‌, ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రంగారెడ్డి డివిజన్‌ అధికారి ఆదివారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు నీరా ప్రాజెక్టు స్థల పరిశీలనకు వచ్చినట్లు వారు తెలిపారు. చారకొండ మండల కేంద్రంలో గీత కార్మికులు అధికంగా ఉన్నారని, వారికి జీవనోపాధి కల్పించేందుకు నీరా ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం సర్పంచ్‌ గుండె విజేందర్‌గౌడ్‌ నివాసంలో గీతా కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరించారు. త్వరలోనే చారకొండలో నీరా ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. జిల్లా ఎక్సైజ్‌ అధికారి ఎండీ ఫయాజొద్దీన్‌, గౌడసంఘం నాయకులు జెల్ల కృష్ణయ్యగౌడ్‌, సవారి జంగయ్యగౌడ్‌, సురేష్‌గౌడ్‌, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు మర్రిపల్లి సర్పంచ్‌ అంగోత్‌ నరేష్‌నాయక్‌, గీతా కార్మికులు, కల్వకుర్తి ఎక్సైజ్‌శాఖ సీఐ శంకర్‌, ఎక్సైజ్‌ శాఖ ఎస్‌ఐ వెంకటేష్‌, ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది గణేష్‌, పరుశరాం, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T03:58:52+05:30 IST