గర్వపడే విప్లవ చరిత్ర తెలంగాణ సొంతం: ఏచూరి

ABN , First Publish Date - 2020-10-18T10:05:36+05:30 IST

గర్వపడే విప్లవ చరిత్ర తెలంగాణ సొంతమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి అన్నారు.

గర్వపడే విప్లవ చరిత్ర తెలంగాణ సొంతం: ఏచూరి

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): గర్వపడే విప్లవ చరిత్ర తెలంగాణ సొంతమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి అన్నారు. సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో  ప్రజా ఉద్యమాలను నిర్మించాలని  పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో  కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ప్రస్థానం(1920-2020)పై ఆన్‌లైన్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. విద్య- వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నా ఏకపక్షంగా నూతన విద్యా విధానం, వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని చెప్పారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న టీఆర్‌ఎ్‌సను వ్యతిరేకిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీని వ్యతిరేకించే నిర్ణయాలపై టీఆర్‌ఎ్‌సను సమర్ధిస్తామని చెప్పారు.

Updated Date - 2020-10-18T10:05:36+05:30 IST