Abn logo
Sep 30 2020 @ 16:51PM

నాన్నా.. నువ్వే బెస్ట్: సితార

Kaakateeya

సూపర్‌స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంది. అలాగే మహేష్ సినిమా పాటలకు డ్యాన్స్ చేసి ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటుంటుంది. తాజాగా తనకు నచ్చిన ఓ పాత ఫొటోను షేర్ చేసింది. 


తండ్రి మెడలో చేతులు వేసి నిద్రపోతున్న ఓ ఫొటోను సితార పంచుకుంది. గతంలో విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్న సమయంలో తండ్రి ఒడిలో నిద్రపోతున్న ఫొటోను షేర్ చేసి.. `సేద తీరేందుకు ఇంత‌క‌న్నా మంచి స్థ‌లం ఎక్క‌డుంటుంది? నాన్నా.. నువ్వే బెస్ట్` అంటూ కామెంట్ చేసింది. సితార కామెంట్‌కు సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 



Advertisement
Advertisement
Advertisement