యూపీలో లవ్ జిహాద్‌పై దర్యాప్తునకు సిట్

ABN , First Publish Date - 2020-09-17T12:14:36+05:30 IST

లవ్ జిహాద్ కేసులపై దర్యాప్తునకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు 9 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.....

యూపీలో లవ్ జిహాద్‌పై దర్యాప్తునకు సిట్

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): లవ్ జిహాద్ కేసులపై దర్యాప్తునకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు 9 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కాన్పూర్ నగరానికి చెందిన ఓ ముస్లిమ్ యువకుడు హిందూ బాలికను లవ్ జిహాద్ కుట్రతో వివాహం చేసుకున్నాడని, ఈ కేసులో హిందూ బాధిత కుటుంబం ఫిర్యాదు మేర తాము దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నియమించామని కాన్పూర్ పోలీసు ఇన్‌స్పెక్టరు జనరల్ మొహిత్ అగర్వాల్ చెప్పారు. ముస్లిమ్ యువకులు లవ్ జిహాద్ పేరిట హిందూ యువతులను పెళ్లాడుతున్నారని హిందూ గ్రూపు నేతలు ఆరోపించారు.తన ఇష్టప్రకారం వివాహం చేసుకున్నానని ఓ హిందూ యువతి తీస్ హజార కోర్టులో సాక్ష్యం చెప్పినా విశ్వహిందూ పరిషత్ నేతలు కిద్వాయ్ నగర్ లో లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరిపారు. 


యూపీలో 15 లవ్ జిహాద్ కేసులపై సిట్ దర్యాప్తు చేయనుంది. లవ్ జిహాద్ కింద హిందూ యువతులను పెళ్లాడిన యువకులకు విదేశాల నుంచి ఏమైనా నిధులు అందాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఇన్‌స్పెక్టరు జనరల్ మొహిత్ అగర్వాల్ చెప్పారు.మైనర్ హిందూ బాలికలను లవ్ జిహాద్ పేరిట వివాహాలు చేసుకోవడం వెనుక కుట్ర దాగి ఉందని కాన్పూర్ వీహెచ్ పీ నాయకుడు దీన్ దయాళ్ గౌర్ ఆరోపించారు. 

Updated Date - 2020-09-17T12:14:36+05:30 IST