అక్కాచెల్లెళ్ల అద్భుత ప్రతిభ.. చిన్న వయస్సులోనే అవార్డుల పంట..

ABN , First Publish Date - 2022-05-21T19:52:54+05:30 IST

అక్కాచెల్లెళ్లు (Sisters) తమ ప్రతిభతో పలు అవార్డులు (Awards) సాధిస్తున్నారు. తొమ్మిది ఏళ్ల ఖేయ గౌరిశెట్టి 100 దేశాల జెండాలు..

అక్కాచెల్లెళ్ల అద్భుత ప్రతిభ.. చిన్న వయస్సులోనే అవార్డుల పంట..

హైదరాబాద్‌ సిటీ : అక్కాచెల్లెళ్లు (Sisters) తమ ప్రతిభతో పలు అవార్డులు (Awards) సాధిస్తున్నారు. తొమ్మిది ఏళ్ల ఖేయ గౌరిశెట్టి 100 దేశాల జెండాలు, 195 దేశాల మ్యాప్‌లను గుర్తిస్తోంది. భారతదేశంలోని (India) 30 ప్రముఖ ప్రాంతాలు, 41 చారిత్రక నిర్మాణాలు, 35 రకాల క్రీడలను గుక్క తిప్పుకోకుండా చెబుతోంది. 54 మంది నేతలు, 36 మంది ప్రసిద్ధ వృత్తినిపుణుల గురించి స్ఫూర్తివంతంగా వివరించి ‘సూపర్‌ కిడ్‌’, ‘జీకే క్వీన్‌’ వంటి బిరుదులు పొందింది. ‘జాగ్రఫీ విజార్‌’్డగా పేరు పొందిన ఏడేళ్ల ఇష్య గౌరిశెట్టి అనేక సంస్థలు నిర్వహించినా ప్రతిభా ప్రదర్శనల్లో పాల్గొని ప్రపంచ పటంలోని 195 దేశాలను నిమిషం 55 సెకన్లలో, 100 దేశాల జెండాలను ఒకటిన్నర నిమిషంలో గుర్తించి రికార్డు సృష్టించింది. చిన్నారి ఇష్య పతకాలను చూస్తూ 100 దేశాల పేర్లను రెండు నిమిషాల్లో చెబుతోంది. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (World Book Of Record), ఏషియా బుక్‌ ఆఫ్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, మిరాకిల్‌ బుక్‌, తెలుగు బుక్‌, సూపర్‌ కిడ్‌, క్రియేటివ్‌ రికార్డులను ఇష్య సాధించింది.


ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాం 

పిల్లలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాం. ఇంట్లో సానుకూల పరిస్థితులు కల్పించి వారి ప్రతిభను మరింత పెంచుకునేందుకు ఓ కాలపట్టిక రూపొందించాం. నెలరోజుల తర్వాత శిక్షణ ప్రారంభించాం. జ్ఞాపకశక్తితో విజయాలు సాధిస్తున్నారు. నాట్యం, స్కేటింగ్‌, గుర్రపు స్వారీ, సంగీతం, చిత్రలేఖనం, ప్రకృతి అధ్యయనం ఇష్యకు ఇష్టం. - చిన్నారుల తల్లిదండ్రులు వరుణ్‌, లలిత.

Updated Date - 2022-05-21T19:52:54+05:30 IST