పర్యాటక కేంద్రంగా సిర్పూర్‌(టి)

ABN , First Publish Date - 2022-01-24T04:26:33+05:30 IST

సిర్పూర్‌(టి) గ్రామపంచాయతీని పర్యాటకకేంద్రంగా తీర్చిది ద్దేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద లక్షల రూపాయలు వెచ్చించి తొమ్మిది పల్లెప్రకృతి వనాలు, పదిఎకరాల్లో 40లక్షల మొక్కలతో బృహత్‌పల్లెప్రకృతి వనం నిర్మాణం చేపడుతోంది.

పర్యాటక కేంద్రంగా సిర్పూర్‌(టి)
సిర్పూర్‌(టి)లోని పల్లె ప్రకృతి వనం

- పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదం

- పది వనాల్లో 40వేల మొక్కలు

సిర్పూర్‌(టి), జనవరి 23: సిర్పూర్‌(టి) గ్రామపంచాయతీని పర్యాటకకేంద్రంగా తీర్చిది ద్దేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద లక్షల రూపాయలు వెచ్చించి తొమ్మిది పల్లెప్రకృతి వనాలు, పదిఎకరాల్లో 40లక్షల మొక్కలతో బృహత్‌పల్లెప్రకృతి వనం నిర్మాణం చేపడుతోంది. ఇందులో 40లక్షల మొక్కలు నాటే లక్ష్యంగా అధి కారులు పనులు వేగవంతంగా చేపడుతున్నారు. ఇవి పూర్తైతే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం లభించనుంది. పల్లె ప్రకృతి వనాలతో ప్రజలకు, చిన్న పిల్లలకు ఆట వస్తువులు, యూత్‌కు ఓపెన్‌ జిమ్‌, వాకింగ్‌ ట్రాక్‌, పార్కు లాంటి సౌకర్యాలు కలిగి ఒక పర్యాటకకేంద్రంగా ఉంటుందని భావి స్తున్నారు. ఒక బృహత్‌ ప్రకృతివనం మంజూరు చేసి ఇందులో అనేక రకరకాల చెట్లను ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి తెప్పించి పెట్టారు. దీని సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో బృహత్‌ ప్రకృతివనం జిల్లాలోనే ఎక్కువ విస్తీర్ణంలో ఉందని ఇటీవల సంద ర్శనకు వచ్చిన అద నపు కలెక్టర్‌ వరుణ్‌ రెడ్డి అన్నారు. వనంలో నాటిన మొక్కలను పరిశీ లించి సంతృప్తి వ్యక్తం చేస్తూ అదనంగా నిధులు మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోనే బృహత్‌ వనంను ఆదర్శంగా తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. ఏది ఏమైన ప్పటికీ సిర్పూర్‌(టి) గ్రామ పంచాయతీలో ఉన్న ప్రకృతి వనాలు రాబోయే రోజుల్లో ఉద్యానవనాలుగా మారే అవకాశాలున్నాయన్నారు. 

బృహత్‌ వనం లక్ష్యం పూర్తిచేస్తాం

- కృష్ణమూర్తి, ఈవో

సిర్పూర్‌(టి) మేజర్‌ పంచాయతీ పరిధిలోని 14వార్డుల్లో పదివనాల నిర్మాణం చేపడుతున్నాం. పల్లె ప్రకృతివనాలు, బృహత్‌ ప్రకృతివనం నిర్మా ణం లక్ష్యం పూర్తిస్థాయికి కృషిచేస్తాం. జిల్లా అధికారుల సలహాలు మేరకు ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తున్నాం.

Updated Date - 2022-01-24T04:26:33+05:30 IST