Resign సిర్పూర్‌లో టీఆర్‌ఎస్‌కు షాక్

ABN , First Publish Date - 2022-08-16T16:25:52+05:30 IST

జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు పెద్ద షాక్ తగిలింది.

Resign సిర్పూర్‌లో టీఆర్‌ఎస్‌కు షాక్

కొమురంభీం: జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ (TRS)కు పెద్ద షాక్ తగిలింది. బెజ్జూరు జెడ్పీటీసీ పుష్పలత (Pushpa latha), ఎంపీటీసీ సాయన్న (Sayanna), ముగ్గురు సర్పంచులు, మరో ఇద్దరు ప్రజాప్రతినిధులు పార్టీకి రాజీనామా చేశారు. రహదారులు, వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన చెందారు. 12 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ రాజీనామాను ఆమోదించాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప (Koneru konappa)కు ప్రజాప్రతినిధులు రాజీనామా లేఖ రాశారు. 

Updated Date - 2022-08-16T16:25:52+05:30 IST