Advertisement

సిరివెన్నెల చివరిచూపు సందర్శనార్ధం.. ఫిల్మ్ ఛాంబర్‌కు

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. తన రాతలతోనే సినిమాకి జీవం పోసిన సీతారామశాస్త్రి కలం అప్పుడే ఆగిపోయిందంటే..  సినీ లోకం జీర్ణించుకోలేకపోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ లోకం నివాళులు అర్పిస్తోంది. కాగా, సిరివెన్నెల చివరిచూపు నిమిత్తమై ఆయన భౌతిక కాయాన్ని బుధవారం ఉదయం 7గంటలకు హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నారు. 


‘‘రేపు (బుధవారం) ఉదయం 7 గంటలకు అభిమానుల సందర్శనార్ధం సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్, ఫిలింనగర్ వద్ద ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి’’ అని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు సమాచారమిచ్చారు.

Advertisement