దివికేగిన అక్షర యోగి.. ముగిసిన అంత్య క్రియలు

టాలీవుడ్ లెజెండరీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాల్ని పూర్తి చేశారు. సిరివెన్నెల చితికి ఆయన జేష్ట కుమారుడు యోగీశ్వరశర్మ నిప్పంటించారు. నిన్న సాయంత్రం 4గంటలకు తుది శ్వాస విడిచారు సిరివెన్నెల. ఆయన భౌతిక కాయాన్ని ఈ ఉదయం ఆయన నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తీసుకొచ్చారు. అక్కడ ఆయన పార్థివ దేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పించారు.ఆయనతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. అనంతరం సిరివెన్నెల అంతిమ యాత్ర మహాప్రస్థానానికి చేరుకుంది. అక్కడ అంతిమ సంస్కారాల్ని పూర్తి చేశారు. అభిమానులు ఆయనకి కన్నీటి వీడ్కోలు పలికారు. 

Advertisement