కాలేజ్ చదివే రోజుల్లో.. సీతారామశాస్త్రి ఎలా ఉన్నారో చూశారా?

సీతారామశాస్త్రి మృతితో సినిమా పాట పెద్దదిక్కును కోల్పోయింది. సిరివెన్నెలతో తమ అనుబంధాన్ని పలువురు సినీ ప్రముఖులు ఇంకనూ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.. ఉంటారు. ఎందుకంటే భౌతికంగా ఆయన లేకపోయినా.. ఆయన రాసిన పాటలు నిద్రలేచిన మొదలు.. రాత్రి పడుకోబోయే వరకు ఎక్కడో ఒక చోట వినబడుతూనే ఉంటాయి. అలా ఆయన అక్షరపూల చెండు అందరినీ పెనవేసుకునే ఉంటుంది. తాజాగా ఆయన ఇంటర్ తర్వాత ఆంధ్రా మెడికల్ కాలేజ్‌లో చేరినప్పటి ఫొటో ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. డాక్టర్ చదవడం కోసం విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీ‌లో చేరి.. చదివేందుకు ఆర్ధిక సమస్యలు ఎదురై మధ్యలోనే మానేశారు సీతారామశాస్త్రి. నిజంగా ఆయన డాక్టర్ అయి ఉంటే ఇన్ని కీర్తిప్రతిష్టలు వచ్చిఉండేవి కావేమో..! తెలుగు పాటకు ఇంత గౌరవం వచ్చి ఉండేదా! అంటూ పలువురు నెటిజన్లు ఈ ఫొటోపై స్పందిస్తున్నారు. 

Advertisement