తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం కృతజ్ఞతాభివందనాలు తెలియజేసింది. ప్రభుత్వం తరపున సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ బుధవారం సిరివెన్నెల పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా.. ప్రభుత్వం తరపున సాయం గురించి ప్రస్తావించినట్లుగా సిరివెన్నెల కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ కష్ట సమయంలో సిరివెన్నెల కుటుంబానికి అండగా ఉంటామని ధైర్య వచనాలు చెప్పినందుకుగానూ తెలంగాణ ప్రభుత్వానికి సిరివెన్నెల కుటుంబ సభ్యులు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా ఓ లేఖను విడుదల చేశారు.