ఏపీ సీఎం జగన్‌కు కృతజ్ఞతాభివందనాలు తెలిపిన సిరివెన్నెల కుటుంబం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డికి సిరివెన్నెల కుటుంబం కృతజ్ఞతాభివందనాలు తెలియజేసింది. సిరివెన్నెల చికిత్స నిమిత్తం కిమ్స్ హాస్పిటల్‌లో అయిన ఖర్చు మొత్తం ఏపీ ప్రభుత్వం భరించి, ఆపత్కాల సమయంలో అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. సిరివెన్నెల కుటుంబ సభ్యులు ఓ లేఖను విడుదల చేశారు. అందులో.. ‘ఈ కష్ట సమయంలో హాస్పిటల్ ఖర్చులు భరించి, మాకు అండగా నిలిచిన ఏపీ ముఖ్యమంత్రిగారికి ధన్యవాదాలు’ అని తెలియజేశారు.


Advertisement