‘ప్రగతి’ సమ్మేళన్‌

ABN , First Publish Date - 2020-02-20T08:51:42+05:30 IST

పల్లెప్రగతితో పారిశుధ్యం, రోడ్లు, పచ్చదనంతో పరుగులు తీసిన దిశగానే పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక దృష్టిసారించే విధంగా పురనగరాల్లో అభివృద్ధి బాట పట్టించేందుకు ప్రభుత్వం పూనుకుంది

‘ప్రగతి’ సమ్మేళన్‌

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): పల్లెప్రగతితో పారిశుధ్యం, రోడ్లు, పచ్చదనంతో పరుగులు తీసిన దిశగానే పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రత్యేక దృష్టిసారించే విధంగా పురనగరాల్లో అభివృద్ధి బాట పట్టించేందుకు ప్రభుత్వం పూనుకుంది. 24 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు పట్టణ ప్రగతి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్ధేశం చేశారు. ఇందులో భాగంగా జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యాక్రమ నిర్వహణపై దిశానిర్ధేశం చేయడానికి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరు టకా నున్నారు. ఇదేక్రమంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ, పల్లెప్రగతిపై మరింత ఉత్సాహం నింపే విధంగా పంచాయతీరాజ్‌ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. గురువారం ఉదయం11.30 గంటలకు సిరిసిల్ల పద్మ నాయక కల్యాణ మండపంలో పంచాయతీరాజ్‌ సమ్మే ళనానికి మంత్రి కేటీఆర్‌ హాజరవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వేములవాడలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ పరిధిలో పట్టణ ప్రగతి సమ్మేళనంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. 


పట్టణ ప్రగతి పరుగులేట్టెనా..

 జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సి పాలిటీల్లో 67 వార్డులు ఉండగా 95 వేల జనాభా ఉంది. సిరిసిల్లలో 39 వార్డులు, వేములవాడలో 28 వార్డుల్లో 24 నుంచి పది రోజుల పాటు పట్ట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం వార్డును యూనిట్‌గా తీసుకోని కార్యక్రమాలు రూప కల్పన చేశారు. ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ఇప్పటికే ప్రతి వార్డులో నాలుగు కమిటీలను 60 మందితో నియమించే విధంగా నోటి ఫికేషన్‌ జారీ చేశారు. పట్టణ ప్రగతి నిర్వహించడా నికి అవసరమైన నిధులను కూడా సమకూర్చుకుం టున్నారు. ప్రత్యేకంగా రెండు మున్సిపాలిటీల్లో విలీ నం గ్రామాల్లో ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మున్సి పాలిటీల్లో పారిశుధ్యం పచ్చదనంతో పాటు మిషన్‌ భగీరథ నీటి సరఫరా, రహదారుల అభివృద్ధి, మెప్మా కార్యక్రమాలు, శ్మశానవాటికల ఏర్పాటు, కూరగాయ లు, మాంసం మార్కెట్‌ ఏర్పాటు, క్రీడా ప్రాంగణాలు, డంపిగ్‌ యార్డులు, షీ టాయ్‌లెట్‌ల స్థలాల గుర్తింపు, వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయడం, విద్యుత్‌ సమస్యల పరిష్కారంలో భాగంగా వంగిన స్తంభాలను సరిచేయడం, తుప్పు పట్టిన స్తంభాల స్తానంలో కొత్తవి ఏర్పాటు చేయడం, రోడ్డు మధ్యలోని స్తంభాలను తొలగించడం, లూజ్‌ వైరింగ్‌ లతో ఏర్పడే ప్రమాదాలను నివారించే దిశగా కార్య క్రమాలను రూపకల్పన చేశారు. ప్రతి నెల మున్సి పాలిటీలకు పల్లెప్రగతికి కేటాయిస్తున్నట్టే 14వ ఆర్థిక సంఘం నిధులను సమకూర్చనున్నారు. 


అధ్వానంగా శివారు కాలనీలు 

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో విలీనం గ్రామాలతోపాటు శివారుకాలనీలు అభి వృది ్ధకి నోచుకోవడం లేదు. రోడ్లు, పారిశుధ్యం ఇతర సమ స్యలతో సతమతమవుతున్నాయి. నీటిసరఫరా అధ్వా నంగా ఉండడంతో పాటు కనీసం రోడ్లు, మురికి కా లువల అభివృద్ధికి నోచుకోని పరిస్థితి ఉంది. పట్టణ ప్రగతిలో మెరుగుపడుతాయని భావిస్తున్నారు. 


ఉత్సవ విగ్రహాలుగా జడ్పీటీసీలు, ఎంపీపీలు 

జిల్లాలో 255 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతితో అభివృద్ధి కనిపిస్తున్న కొత్తగా ఏర్పడిన జిల్లా పరిషత్‌ పాలకవర్గం, మండల పరిషత్‌ పాలకవర్గాలు మాత్రం నిధులు లేక నిస్సేజంగా ఉత్సవ విగ్రహాలుగా మా రారు. గత ఐదేండ్ల నుంచి జిల్లా పరిషత్‌ మండల పరిషత్‌లకు అరకొర నిధులే వస్తున్నాయి. గత సం వత్సరం జూలై 4న 12 మంది జడ్పీటీసీలు, 12 మం ది ఎంపీపీలు పరిషత్‌ పాలకవర్గాల్లో కొనసాగుతున్న నిధులు లేకపోవడంతో నిరాశతో ఉన్నారు. జిల్లా పరి షత్‌ సర్వసభ్య సమావేశంలోనే జడ్పీటీసీ, ఎంపీపీలు ఉత్సవ విగ్రహాలుగా మారామని ఆవేదన వ్యక్తం చేసి న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన జిల్లా పరిషత్‌తో పాటు మండల పరిషత్‌కు నిధుల కేటాయింపు జరగడం లేదు. ప్రస్తుతం నేరుగా గ్రామ పంచాయతీలకే నిధులను విడుదల చేస్తున్నారు. కేం ద్ర ప్రభుత్వం గతంలో బీఆర్‌జీఎఫ్‌ పేరిట ప్రత్యేక నిఽ దులు కేటాయించేది. ఈ నిధులను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ఏడాదిలో రెండు సార్లు వచ్చేవి. మండల జనాభా ఆధారంగా నిధులు విడుదలయ్యేవి. ఇవికూడా మూడేళ్లుగా రా వడం లేదు. జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రస్థుతం ఎమ్మె ల్యే, ఎంపీ నిధుల కోసమే అశలు పెట్టుకున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తుండడంతో జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ల ఆధ్వర్యంలో పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. 14వ ఆర్థిక సంఘం నుంచి గ్రామ పంచా యతీలకు మొదటి విడత 2019- 2020 సెప్టెంబరు లో రూ. 4.15 కోట్లు, రెండో విడత అక్టోబరులో రూ. 4.12 కోట్లు, నవంబరులో రూ.6.50 కోట్లు విడుదల అయ్యాయి. పల్లె ప్రగతిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1117 సమస్యలను గుర్తించి బాగు చేశారు. ఇందులో శిథిలమైన ఇళ్లు, చెత్త, పిచ్చిమొక్కలు వంటివి పరిష్క రించారు. 113 పాడుబడిన బావులు, బోరు బావులను గుర్తించి 96 పరిష్కరించారు. రోడ్లపై గుంతలు, నీరు నిలిచే ప్రదేశాలను 507 గుర్తించి పరిష్కరించారు. 247972 అవెన్యూ ప్లాంటేషన్‌ ద్వారా మొక్కలు నాటా రు. ప్రతిగ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేశారు. శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులను గుర్తించారు. పట్టణ ప్రగతి, పల్లెప్రగతితో జిల్లా పచ్చదనం, పా రిశుధ్యంలో మెరుగైన ఫలితాలు సాధిస్తుందని భావిస్తున్నారు. 

Updated Date - 2020-02-20T08:51:42+05:30 IST