సిరిసిల్ల: నగరంలో వినాయక విగ్రహాలు కొట్టుకుపోయాయి. వరద ఉధృతి పెరగడంతో దుకాణాల్లో ఉన్న విగ్రహాలు ప్రవాహానికి కొట్టుకుపోయాయి. పలు కాలనీల్లో భారీగా వరదనీరు చేరింది. ఇంటిముందు పార్క్ చేసిన కార్లు నీటిలో అమాంతం కొట్టుకుపోయాయి. మరోవైపు రహదారిపై ఉధృతంగా వరదనీరు ప్రవహిస్తుండడంతో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. ఓ చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.
కరీంనగర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ప్రమాదకరమైన రీతిలో నడుస్తున్నాయి. కరీంనగర్‌లో ఎటు చూసినా వరద నీరే దర్శమిస్తోంది.