Abn logo
Jan 15 2021 @ 17:09PM

బ్రిస్బేన్‌లోనూ సేమ్ సీన్.. సిరాజ్‌ను తిట్టిన ప్రేక్షకులు!

బ్రిస్బేన్: టీమిండియాకు ఆస్ట్రేలియాలో అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. మొన్న సిడ్నీ టెస్టులో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు మన ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన విషయం మరువక ముందే మళ్లీ అలాంటి ఘటనే వెలుగు చూసింది. బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు ఆడుతున్న సమయంలో.. ఫీల్డింగ్ చేస్తున్న మహమ్మద్ సిరాజ్‌పై ఓ అభిమాని నోరు పారేసుకున్నాడు. ‘‘మా వైపు చేతులు ఊపు సిరాజ్’’ అంటూ కేకలు వేసిన అతను చివరికి.. ‘‘సిరాజ్, యూ బ్లడీ గ్రబ్(గలీజు మనిషి)’’ అంటూ తిట్టాడు.సిరాజ్‌తో పాటు మరో బౌలర్ వాషింగ్టన్ సుందర్‌ను కూడా ప్రేక్షకులు టార్గెట్ చేశారని తెలుస్తోంది.


Advertisement
Advertisement
Advertisement