ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్‌: సిరాజ్‌

ABN , First Publish Date - 2022-01-19T08:47:55+05:30 IST

కోహ్లీ తన సూపర్‌ హీరో అని టీమిండియా పేసర్‌ సిరాజ్‌ అన్నాడు. విరాట్‌ సారథిగా వైదొలిగినా.. ఎప్పటికీ తన కెప్టెన్‌ కోహ్లీనే అని చెప్పాడు. ..

ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్‌: సిరాజ్‌

పార్ల్‌: కోహ్లీ తన సూపర్‌ హీరో అని టీమిండియా పేసర్‌ సిరాజ్‌ అన్నాడు. విరాట్‌ సారథిగా వైదొలిగినా.. ఎప్పటికీ తన కెప్టెన్‌ కోహ్లీనే అని చెప్పాడు. తనకు ఎంతో మద్దతుగా నిలిచిన విరాట్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నాడు. ‘నా సూపర్‌ హీరో, నీ నుంచి లభించిన ప్రోత్సాహం, మద్దతుకు రుణపడి ఉంటా. ఎప్పటికీ నా గొప్ప సోదరుడివి. దారుణమైన పరిస్థితుల్లోనూ నాలోని ప్రతిభను గుర్తించావు’ అని సిరాజ్‌ ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్టు పెట్టాడు. కోహ్లీ కెప్టెన్సీలో సిరాజ్‌ మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. 

Updated Date - 2022-01-19T08:47:55+05:30 IST