సారూ.. న్యాయం చేయండి

ABN , First Publish Date - 2022-07-03T04:47:05+05:30 IST

‘ఎప్పటినుంచో నాపేరుపై ఉన్న భూమిని వీఆర్‌ఓ మరొకరి పేరుపై ఆన్‌లైన్‌ చేశాడు. ఇప్పటి కీ నా స్వాధీన అనుభవంలో ఉండి నేనే సాగు చేసుకుంటు న్న భూమిని మరొకరికి బదలాయిస్తూ ఎవరికి చెప్పుకుంటా వో చెప్పుకో పో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు.. మీరైనా జోక్యం చేసుకుని.. న్యాయం చేయండి’ అంటూ వం డాడి గ్రామం దండువారిపల్లె వాసి కండ్లూరి వెంకటయ్య వేడుకుంటున్నాడు. వివరాల్లోకెళితే....

సారూ..  న్యాయం చేయండి

వేరొకరికి ఆన్‌లైన్‌ 

అడిగితే నిర్లక్ష్య సమాధానం 

కలెక్టర్‌కు విన్నపం

చిన్నమండెం, జూలై 2: ‘ఎప్పటినుంచో నాపేరుపై ఉన్న భూమిని వీఆర్‌ఓ మరొకరి పేరుపై ఆన్‌లైన్‌ చేశాడు. ఇప్పటి కీ నా స్వాధీన అనుభవంలో ఉండి నేనే సాగు చేసుకుంటు న్న భూమిని మరొకరికి బదలాయిస్తూ ఎవరికి చెప్పుకుంటా వో చెప్పుకో పో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నాడు.. మీరైనా జోక్యం చేసుకుని.. న్యాయం చేయండి’ అంటూ వం డాడి గ్రామం దండువారిపల్లె వాసి కండ్లూరి వెంకటయ్య వేడుకుంటున్నాడు. వివరాల్లోకెళితే....

 వండాడి గ్రామం సర్వే నెంబరు 647లో 83సెంట్ల భూమి ఎప్పటి నుంచో ఆన్‌లైన్‌లో వెంకటయ్య పేరు ఉంది. అయితే వీఆర్‌ఓ రామయ్య అతనికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుం డానే ఆ భూమిని మరొకరికి ఆన్‌లైన్‌ చేయించాడు. ఈ విష యమై బాధితుడు 2018 నుంచి ఇప్పటి వరకు మూడుసార్లు స్పందనలో ఫిర్యాదు చేశాడు. ఆ భూమి రిజిస్టర్‌ డాక్యుమెం ట్లు, లింకు డాక్యుమెంట్లు, ఈసీ, మండల సర్వేయర్‌ గ్రామ స్తుల సమక్షంలో సర్వే చేసి ఇచ్చిన సర్టిఫికెట్టు చూపించాడు. తన భూమిని తన పేరు మీద ఆన్‌లైన్‌ చేయమని బతిమ లాడినా వీఆర్‌ఓ పట్టించుకోలేదు. దీంతో మే 21న చిన్నమం డెం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కూర్చుని నిరసన తెలి పాడు.

దీంతో వెంటనే తహసీల్దార్‌ అతన్ని పిలిపించి, వెంట నే రికార్డులు తెప్పించి సమస్య పరిష్కరించాలని వీఆర్‌ఓను ఆదేశించారు. అయినా వీఆర్‌ఓ బాధితుడిని లెక్కచేయడం లేదు. మండల స్థాయిలో అధికారులకు ఎంత మొరపెట్టుకు న్నా.. ఫలితం లేదని, స్వయంగా కలెక్టర్‌ జోక్యం చేసుకుంట నే.. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాడు. 

 వీఆర్‌ఓపై ఆరోపణల వెల్లువ

 వండాడి ఇన్‌ఛార్జ్‌ వీఆర్‌ఓగా పని చేస్తున్న రామయ్యపైన అనేక ఆరోపణలున్నాయి. దీర్ఘకాలంగా ఇతను ఇక్కడే పని చేస్తున్నాడు. ప్రజలతో దురుసుగా మాట్లాడతాడని పలువురు ఆరోపిస్తున్నారు. భూముల మ్యుటేషన్‌ కోసం వెళ్లిన రైతుల దగ్గర కూడా బాగానే పిండుకుంటాడనే ఆరోపణలున్నాయి. మల్లూరు గ్రామం తిమ్మారెడ్డిగారిపల్లెకు చెందిన ఒక రైతు దగ్గర మ్యుటేషన్‌ కోసం రూ. 5వేలు వసూలు చేసినట్లు ఆరో పణలున్నాయి.

బెల్లంవాండ్లపల్లె కుర్వపల్లెకు చెందిన ఒక యువతికి పోస్టల్‌ డిపార్టమెంట్‌లో ఉద్యోగం వచ్చింది. ఆమె కొత్తగా కుల ధృవీకరణ ప్రతాన్ని సమర్పించాల్సి వచ్చింది. ఇందుకోసం వచ్చిన ఆమెతో వివాహమైన వారికి అత్తగారి ఊర్లో కులధృవీకరణ పత్రం తెచ్చుకోమని తెలిపాడు. అంతేకా కుండా గతంలో చిన్నమండెం మండల కేంద్రంలో జారీ చేసి న కులధృవీకరణ పత్రాన్ని ఆమెకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే రద్దు చేశాడు. దీంతో ఉద్యోగానికి ఇబ్బంది అవు తుందని ఆమె కాళ్లావేళ్లా పడడంతో ఒక మధ్యవర్తి చేతుల మీదుగా రూ.2500 వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. తిమ్మారెడ్డిగారిపల్లెకే చెందిన 527 సర్వేనెంబరు లో 26 సెంట్లు డిజిటల్‌ సంతకం పెండింగ్‌లో ఉంది. తహసీల్దార్‌ పేరుతో వీఆర్‌ఓ పదేపదే డబ్బు వసూలు చేస్తున్నట్లు రైతు ఆరోపించారు. అతనితో ఏ అవసరం వచ్చినా.. ముడుపులు చెల్లిస్తేనే.. పనులు చేస్తాడని గ్రామ స్తులు వాపోతున్నారు. 

నా దృష్టికి రాలేదు 

 647 సర్వేనెంబరు విషయం తమ దృష్టికి వచ్చింది. దానికి సంబంధించి ఇరువర్గాల డాక్యుమెంట్లు చూసి బాధితులకు న్యాయం చేస్తాం. మిగిలిన విషయాలు నా దృష్టికి రాలేదు. 

మహమ్మద్‌చాంద్‌, తహసీల్దార్‌ 

647 సర్వేలో పొరబాటు జరిగింది

 647 సర్వే నంబరులో పొరబాటు జరిగింది. నిజమే. భూ యజమాని కండ్లూరి వెంకటయ్యకు నోటీసులు ఇవ్వకుండానే అతని పేరు మీద ఉన్న ఆన్‌లైన్‌ తీసేశాను. అతని రికార్డులు పరిశీలించా. త్వరలోనే అతని పేరు మీద ఆన్‌లైన్‌ చేస్తాం. నే ను ఎవరి దగ్గరా సర్టిఫికెట్ల కోసం డబ్బు వసూలు చేయలే దు. మ్యుటేషన్‌ కోసం కూడా ఎవరి వద్దా.. డబ్బు వసూలు చేయలేదు. నేనంటే గిట్టని వాళ్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

రామయ్య, వీఆర్‌ఓ    

Updated Date - 2022-07-03T04:47:05+05:30 IST