సీఎం సారూ.. ఇదేమి తీరు?

ABN , First Publish Date - 2022-09-28T06:28:48+05:30 IST

తిరుమల వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలంటే తిరుపతి నగరమంతా కూడా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుంది. ఎటు చూసినా దేవతా మూర్తుల చిత్రాలతో అలంకరించిన దీపతోరణాలే కనిపిస్తాయి. తిరుపతి నగర చరిత్రలోనే ఇందుకు భిన్నమైన వాతావరణం మంగళవారం కనిపించింది. పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సీఎం జగన్‌ ఫొటోల భారీ ఫ్లెక్సీలతో నగరం కిక్కిరిసిపోయింది.

సీఎం సారూ.. ఇదేమి తీరు?
మూతబడ్డ గంగమ్మ ఆలయం

నగరమంతా జగన్‌ నిలువెత్తు ఫ్లెక్సీలు


చిన్నబోయిన బ్రహ్మోత్సవ శోభ


 తిరుమల వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలంటే తిరుపతి నగరమంతా కూడా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుంది. ఎటు చూసినా దేవతా మూర్తుల చిత్రాలతో అలంకరించిన దీపతోరణాలే కనిపిస్తాయి. తిరుపతి నగర చరిత్రలోనే ఇందుకు భిన్నమైన వాతావరణం మంగళవారం కనిపించింది. పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సీఎం జగన్‌  ఫొటోల భారీ ఫ్లెక్సీలతో నగరం కిక్కిరిసిపోయింది. రేణిగుంట విమానాశ్రయం నుంచే ఫ్లెక్సీలు మొదలయ్యాయి. నక్కల కాలనీ వంటి మురికివాడలు సీఎం కంటపడకుండా అడ్డుగా తెరలు కట్టేశారు. సీఎం ప్రయాణమార్గంలో చెత్త కుప్పలు, మురికి కాలువలు ఉన్న చోటంతా ఇదేవిధంగా తెరలు అడ్డుగా కట్టారు. నగరంలోని గోడల మీద గతంలో రంగులతో చిత్రించిన హిందూ దేవుళ్ల చిత్రాలను, మహనీయుల బొమ్మలనూ ముందు రోజే చెరిపేసి వైసీపీ రంగులు పులిమేశారు. ఇక తాతయ్యగుంట గంగమ్మ గుడికి సీఎం రావడం కూడా ఆ  ప్రజలకు శాపంగా మారింది. ఉద యం నుంచే ఏకంగా గంగమ్మ దర్శనాలు రద్దు చేసేశారు. ఆ ప్రాంతంలోని దుకాణాలన్నీ బంద్‌ చేయించి, వాటి ముందు బారికేడ్లు అడ్డుగా కట్టేశారు. పోలీసుల హడావుడి తప్ప ప్రజల సందడి లేకుండా సీఎం తిరుపతి వచ్చి తిరుమలకు వెళ్లిపోయారు.అప్పటిదాకా బిక్కుబిక్కుమంటూ ఉన్న నగరంలోని అనేక ప్రాంతాలు ఆ తర్వాతే ఊపిరి పీల్చుకున్నాయి.రాత్రి తిరుమల శ్రీనివాసునికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమం మాత్రం ప్రశాంతంగా సాగింది. 

- తిరుపతి, ఆంధ్రజ్యోతి






Updated Date - 2022-09-28T06:28:48+05:30 IST