మా ఊరికి రోడ్డు వేయించండి సారూ

ABN , First Publish Date - 2022-08-20T06:26:24+05:30 IST

మా ఊరికి రోడ్డు వేయించండి సా రూ అంటూ చండూరు మండలం పడమటితాళ్ల గ్రామస్థులు ధర్నా నిర్వహించారు.

మా ఊరికి రోడ్డు వేయించండి సారూ
రోడ్డుపై ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

 పటమటితాళ్ల గ్రామస్థుల ఆందోళన  

చండూ రు రూరల్‌, ఆగస్టు 19: మా ఊరికి రోడ్డు వేయించండి సా రూ అంటూ చండూరు మండలం పడమటితాళ్ల గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. శుక్రవారం గ్రామంలో బురదమయమైన రోడ్డుపై ఆందోళన చేపట్టారు. నూతనంగా ఏర్పాటైన పడమటితాళ్ల గ్రామపంచాయతీ చండూరు మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్నా అభివృద్ధి మాత్రం శూన్యమని పేర్కొన్నారు. గత పాలకులు రోడ్డు వేయిస్తామని ఇచ్చిన హామీని విస్మరించారని ఆరోపించారు. ఉపఎన్నికలో పోటీచేసే అభ్యర్థులు ఎవరైనా పడమటితాళ్ల గ్రా మానికి రోడ్డు వేయిస్తే గ్రా మస్థులంతా వారికే ఓట్లు వేస్తామని తెలిపారు. అ లాంటి నమ్మకం కలిగించే నాయకుడు మాత్రమే తమ గ్రామానికి రావాలని అన్నారు. అనంతరం గ్రామస్థులు చం డూరు టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇనచార్జి, ఎ మ్మెల్యే భగతకు వినతిపత్రం అందజేశా రు. కార్యక్రమంలో ఉపసర్పంచ, వార్డు సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-20T06:26:24+05:30 IST