Mega millions Lottery: అదృష్టం అంటే ఇదీ..! లాటరీలో రూ.10 వేల కోట్లకు పైగా గెలుపు..!

ABN , First Publish Date - 2022-07-31T01:42:35+05:30 IST

లాటరీలో ఒక కోటో, రెండు కోట్లో లేదా పది కోట్లో ఎవరైనా గెలిచారని తెలిస్తేనే మనం ఆశ్చర్యపోతాం..! అదే.. పది వేల కోట్లు గెలిస్తే..? ఆశ్చర్యంగా ఉంది కదూ..? అసలు ఇది సాధ్యమేనా అంటే.. కచ్చితంగా సాధ్యమే..

Mega millions Lottery: అదృష్టం అంటే ఇదీ..! లాటరీలో రూ.10 వేల కోట్లకు పైగా గెలుపు..!

ఎన్నారై డెస్క్: లాటరీలో ఒక కోటో, రెండు కోట్లో లేదా పది కోట్లో ఎవరైనా గెలిచారని తెలిస్తేనే మనం ఆశ్చర్యపోతాం..! అదే.. పది వేల కోట్లు గెలిస్తే..? ఆశ్చర్యంగా ఉంది కదూ..? అసలు ఇది సాధ్యమేనా అంటే.. కచ్చితంగా సాధ్యమే.. అమెరికాలోని మెగామిలియన్(Mega millions) లాటరీలో ఓ వ్యక్తి శనివారం ఏకంగా 1.28 బిలియన్లు గెలుచుకున్నారు. అమెరికా చరిత్రలోనే మూడో అతిపెద్ద లాటరీ మొత్తం ఇదేనని అక్కడి మీడియా చెబుతోంది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది రూ. పది వేల కోట్లకు పైనే. ఇలినాయ్ రాష్ట్రంలో ఎవరో ఈ టిక్కెట్టు కొన్నట్టు లాటరీ నిర్వాహకులు తెలిపారు. ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియలేదు. 


‘‘మెగా మిలియన్స్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తం జారీ అవడం చూసినందుకు మాకెంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ మొత్తాన్ని ఎవరు గెలుచుకున్నారో తెలుసుకునేందుకు మేమెంతో ఉత్సుకతతో ఉన్నాం.’’ అని మెగామిలియన్ కన్సార్షియమ్ లీడ్ డైరెక్టర్ ప్యాట్ మెక్‌డోనల్డ్ తెలిపారు. ఇక.. లాటరీలో గెలిచిన వారు ఈ మొత్తాన్నంతా ఒకేసారి తీసుకోవాలనుకుంటే 747.2 మిలియన్ డాలర్లు మాత్రమే వస్తుంది. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు పోనూ చేతిలో 457.2 మిలియన్ డాలర్లు మిగులుతుంది. అయితే.. ఏడాదికి కొంత మొత్తం చొప్పున తీసుకుంటే 29 ఏళ్లలో లాటరీలో గెలుచుకున్న మొత్తం సొమ్మును పొందవచ్చని లాటరీ నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త అమెరికాలో సంచలనానికి దారి తీసింది. ఇంత మొత్తం గెలుచుకున్న అదృష్టవంతులు ఎవరో తెలుసుకునేందుకు దేశం మొత్తం ఎదురు చూస్తోంది. 

Updated Date - 2022-07-31T01:42:35+05:30 IST