వాట్సప్‌ అకౌంట్‌ మల్టిపుల్‌గా..!

ABN , First Publish Date - 2020-05-16T05:30:00+05:30 IST

ఒకే వాట్సప్‌ అకౌంట్‌ను ఒకటికన్నా ఎక్కువ డివైజ్‌లలో ఉపయోగించవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ త్వరలో వాట్సప్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ఒక వాట్సప్‌ అకౌంట్‌ను ఒక్క డివైజ్‌లో మాత్రమే ఉపయోగించుకొనే వెసులుబాటు...

వాట్సప్‌ అకౌంట్‌ మల్టిపుల్‌గా..!

ఒకే వాట్సప్‌ అకౌంట్‌ను ఒకటికన్నా ఎక్కువ డివైజ్‌లలో ఉపయోగించవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ త్వరలో వాట్సప్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు ఒక వాట్సప్‌ అకౌంట్‌ను ఒక్క డివైజ్‌లో మాత్రమే ఉపయోగించుకొనే వెసులుబాటు ఉంది. కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఒక వాట్సప్‌ అకౌంట్‌ ఉన్న వారు, రెండు, మూడు డివైజ్‌లలోనూ ఆ అకౌంట్‌ను ఉపయోగించుకొనే వీలు కలుగుతుంది. ప్రస్తుతం లేటెస్ట్‌ బేటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను అందుబాటులో ఉంచారు. ‘రిజిస్ట్రేషన్‌ నోటిఫికేషన్స్‌’గా పిలుస్తున్న ఈ ఫీచర్‌లో సెక్యూరిటీ కోడ్‌ ఎంటర్‌ చేయడం ద్వారా సెకండ్‌ డివైజ్‌లోనూ వాట్సప్‌ అకౌంట్‌ ఉపయోగించుకోవచ్చు.

Updated Date - 2020-05-16T05:30:00+05:30 IST