అంబాలా నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

ABN , First Publish Date - 2020-10-30T13:13:26+05:30 IST

సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పాలిథీన్ బ్యాగుల వినియోగం విషయంలో హర్యానా రాష్ట్రంలోని అంబాలా నగర మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం....

అంబాలా నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

అంబాలా (హర్యానా): సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పాలిథీన్ బ్యాగుల వినియోగం విషయంలో హర్యానా రాష్ట్రంలోని అంబాలా నగర మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబరు 1వతేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పాలిథీన్ బ్యాగుల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు అంబాలా మున్సిపల్ కార్పొరేషన్ కార్యదర్శి ప్రకటించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పాలిథీన్ బ్యాగులను ప్రజలు వినియోగించరాదని అవగాహన కల్పిస్తున్నామని మున్సిపల్ అధికారులు చెప్పారు. ‘‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పాలిథీన్ సంచులను దుకాణాదారులు వినియోగించరాదు, వినియోగదారులు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పాలిథీన్ బ్యాగులను తిరస్కరించాలి...అలా చేయకుండా పాలిథీన్ సంచులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగిస్తే దుకాణాదారులకు జరిమానాలు విధిస్తామని అంబాలా మున్సిపల్ కార్పొరేషన్ కార్యదర్శి హెచ్చరించారు. ప్లాస్టిక్ ను వాడవద్దంటూ అంబాలా నగరంలో అవగాహన ర్యాలీలను మున్సిపల్ అధికారులు జరిపారు.

Updated Date - 2020-10-30T13:13:26+05:30 IST