Abn logo
Sep 17 2020 @ 00:25AM

సింగీతం... నాగబాబుకు కొవిడ్‌ పాజిటివ్‌

ఇప్పటికే ప్రముఖ గాయకులు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో చికిత్స పొందుతుండగా తాజాగా మరో ఇద్దరు తెలుగు సినీ ప్రముఖులకు ఈ వ్యాధి సోకింది. సీనియర్‌ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, నటుడు, నిర్మాత నాగబాబుకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని వారు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ‘‘ఈ నెల తొమ్మిదిన వైద్య పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. అయితే చాలా తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. అప్పటి నుంచి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నాను. ఈ నెల 22తో క్వారంటైన్‌ ముగుస్తుంది. పుస్తకాలు చదువుతున్నాను. కొన్ని స్ర్కిప్ట్‌లపై వర్క్‌ చేస్తున్నాను. కరోనా బారిన పడకుండా అందరూ మాస్క్‌లు ధరించి తగు జాగ్రత్తలు తీసుకోండి’’ అని సింగీతం శ్రీనివాసరావు వీడియో సందేశంలో తెలిపారు. ఆయన ఈ నెల 21న తన 89వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. 


ప్లాస్మా దానం చేస్తా

మెగా బ్రదర్‌ నాగబాబు తనకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. ‘‘వ్యాధి వచ్చిందని బాధపడకుండా, కోలుకొని వేరొకరికి సాయం చేయాలి. సరైన జాగ్రత్తలు తీసుకొని కరోనా నుంచి బయటపడి, ప్లాస్మాదాతగా మారతాను’’ అని తెలిపారు.  చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెట్టారు. వారందరికీ నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement