Abn logo
Mar 5 2021 @ 17:25PM

కల్లు గ్లాసుతో సింగర్‌ సునీత‌.. ఫొటో వైరల్‌

సింగర్‌ సునీత పరిచయం అక్కరలేని పేరు. సెకండ్‌ మ్యారేజ్‌తో ట్రెండ్‌ సెట్టర్‌గా మారిన సునీత.. పెళ్లి తర్వాత యమా యాక్టివ్‌గా కనబడుతున్నారు. అంతకు ముందు కూడా నిండైన చీరకట్టులో, ఎప్పుడూ నవ్వుతూనే సునీత కనిపించేవారు. కాకపోతే ఇప్పుడు ఇంకాస్త స్పెషల్‌గా కనిపిస్తున్నారు. ఈ మధ్య ఆమె ఏ ఫంక్షన్‌లో చూసినా ఫుల్‌ జోష్‌తో కనిపిస్తున్నారు. తాజాగా ఆమె కల్లు గ్లాస్‌ పట్టుకుని ఫొటోలకి ఫొజిచ్చింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి ఆమె కల్లు తాగిందా? లేదా అనేది పక్కన పెడితే.. ఆమె, ఆమెతో పాటు మరికొందరు.. కల్లు సేవిస్తున్నట్లుగా ఉన్న ఫొటోలు మాత్రం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం హైదరాబాద్ ప్రగతి రిసార్టులో ఓ స్పెషల్ ప్రోగ్రామ్ షూట్‌లో సింగర్‌ సునీతతో పాటు మరికొందరు పాల్గొన్నారు. ఇక్కడే కల్లు తాగుతున్న గ్లాసు పట్టుకుని ఆమె కెమెరాలకు ఫోజులిచ్చారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇంకేముంది సునీత కల్లు.. గ్లాసులకు గ్లాసులు తాగేస్తోందని సోషల్‌ మీడియా అంతా వైరల్‌గా కామెంట్లు మొదలయ్యాయి. నిజానికి షూటింగ్ జరిగిన ప్రగతి రిసార్టులో తాటిచెట్లు బాగా ఎక్కువగా వుంటాయి. వేసవి కావడంతో గీత కార్మికులు తాటి కల్లును తీసి అమ్ముతుంటారు. సింగర్ సునీత పాల్గొంటున్న షో దగ్గరకి కొందరు గీత కార్మికులు తాజా కల్లును తీసుకుని వచ్చారు. ఆ కల్లును చూడగానే తోటి కళాకారులు కొందరు సిప్ చేస్తూ ఎంజాయ్ చేశారు. సింగర్ సునీతకు కూడా ఓ గ్లాసు కల్లు ఇచ్చారు. మరి సునీత కల్లు తాగారో లేదో కానీ కల్లు గ్లాసుతో వున్నట్లు ఫోటోల్లో మాత్రం కనబడుతున్నారు. ఆమెతో పాటు యాంకర్, నటి భార్గవి కూడా కల్లు గ్లాసుతో ఈ ఫొటోలో దర్శనమిచ్చారు.

Advertisement
Advertisement
Advertisement