Abn logo
Nov 29 2020 @ 11:50AM

సింగర్‌ సునీత.. రెండో పెళ్లి?

టాలీవుడ్‌ క్రేజీ సింగర్స్‌లో సునీత ఒకరు. ఈమె కేవలం సింగర్‌గానే కాకుండా వ్యాఖ్యాతగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సునీత మొదటి భర్త నుండి విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేస్తూ.. తను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని, ఈ విషయంలో తనపై వస్తున్న పుకార్లను పట్టించుకోనని అన్నారు. అయితే లేటెస్ట్‌గా సింగర్‌ సునీత్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. డిజిటల్‌ రంగంలో కీలక పాత్రను పోషిస్తున్న ఓ బిజినెస్‌మ్యాన్‌ను సునీత పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. సునీత పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తికి కూడా ఇది రెండో పెళ్లేనట. మరి తన పెళ్లి గురించి వినిపిస్తోన్న రూమర్స్‌పై సింగర్‌ సునీత ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement