Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 19 Aug 2022 15:43:27 IST

Singer Mohana Bhogaraju: అందులో నిజం లేదు!

twitter-iconwatsapp-iconfb-icon

‘బిగ్‌బాస్‌ సీజన్‌ 6’(Bigboss 6) కోసం రంగం సిద్థమవుతోంది. సెప్టెంబర్‌ 4 నుంచి తాజా సీజన్‌ ప్రసారం కానుంది. ఇప్పటికే ఇంటి సభ్యుల వేట పూర్తయినట్లు తెలుస్తోంది. అనధికారికంగా కొందరి పేరు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. చలాకీ  చంటీ, గీతు రాయల్‌, శ్రీహాన్‌, సత్య, దీపిక పిల్లి, అర్జున్‌ కల్యాణ్‌, రేవంత్‌, వాసంతి కృష్ణన్‌, సుదీప(నువ్వు నాకు నచ్చావ్‌ ఫేం)ఇలా కొందరి పేరు వినిపిస్తున్నాయి. తాజాగా పాపులర్‌ సింగర్‌ పేరు కూడా వినిపిస్తోంది. ‘బుల్లెట్‌ బండి’ (bullet bandi fame)సాంగ్‌ ఫేం మోహన భోగరాజు (Mohana bhogaraju)బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టనున్నారని, ఇప్పటికే ఆమెను దీనికోసం సంప్రదించారని సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ జరుగుతోంది. ఈ విషయం గురించి ఆమెను సంప్రదించగా అలాంటిదేమీ లేదని ఆమె తెలిపారు. బిగ్‌బాస్‌ సీజన్‌ కోసం తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలుగు సినిమా పాటలతో పాటు, ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే ఆమె నుంచి ఆసక్తికరమైన పాటలు రానున్నాయని చెప్పారు. ‘బుల్లెట్‌ బండి’ తరహాలో ఆకట్టుకునే సాంగ్‌ కోసం సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు.

 

‘మనోహరి’ (బాహుబలి), ‘భలే భలే మగాడివోయ్‌’ టైటిల్‌ సాంగ్‌, ‘డిక్క డిక్క డుండుం’ (సోగ్గాడే చిన్నినాయన),  రెడ్డమ్మ తల్లి (అరవింద సమేత), మెల్లగా తెల్లారిందో(శతమానం భవతి), ‘మగువ మగువ’ (వకీల్‌సాబ్‌), ‘వాసివాడి తస్సదియ్యా’(బంగార్రాజు), ఓ మావ(భీమ్లానాయక్‌) వంటి పాటలతో ఆమె పాపులర్‌ అయ్యారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement