రామగుండంలో 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ABN , First Publish Date - 2021-07-22T14:35:51+05:30 IST

జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రామగుండం రీజియనల్‎లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎడతెరపి లేకుండా భారీగా వర్షం కురవడంతో ఓపెన్ కాస్టుల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది. వర్షం వల్ల ఓపెన్

రామగుండంలో 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

పెద్దపల్లి: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి రామగుండం రీజియనల్‎లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎడతెరపి లేకుండా భారీగా వర్షం కురవడంతో ఓపెన్ కాస్టుల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది. వర్షం వల్ల ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల పరిసరాలన్నీ బురదమయంగా మారాయి. దీంతో బొగ్గు రవాణాకు విఘాంతం కలుగుతోంది. భారీ వర్షం వల్ల రామగుండం రీజియన్‎లోని 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రూ. కోటి విలువ చేసే 30 టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టం వాటిల్లిందని అధికారుల చెబుతున్నారు.

Updated Date - 2021-07-22T14:35:51+05:30 IST