సింగరేణి ఎన్నికల వేడి.. కవిత వర్సెస్ సీతక్క

ABN , First Publish Date - 2021-07-15T19:52:05+05:30 IST

మంచిర్యాల జిల్లా: సింగరేణిలో ఎన్నికల రాజకీయ వేడి రగులుతోంది.

సింగరేణి ఎన్నికల వేడి.. కవిత వర్సెస్ సీతక్క

మంచిర్యాల జిల్లా: సింగరేణిలో ఎన్నికల రాజకీయ వేడి రగులుతోంది. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కర్మిక సంఘం గెలుపు కోసం ఎమ్మెల్సీ కవిత వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అలాగే కాంగ్రెస్ అనుబంధ సింగరేణి బొగ్గుగని లేబర్ యూనియన్ తరఫున ఎమ్మెల్యే సీతక్కను బరిలోకి దించేందుకు రంగం సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో సింగరేణి రాజకీయం కవిత వర్సెస్ సీతక్కలా మారేలా కనిపిస్తోంది. 


సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల వేడి అంతకంతకు రాజుకుంటోంది. ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న అంచనాతో కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. దీంతో ఎన్నికల్లో గెలుపుకోసం అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. నిజానికి గత ఏడాదిగా సింగరేణి ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తారన్న హడావుడి కనిపించింది. ఆయితే ఆర్థిక సంవత్సరం చివరిలో ఎన్నికలతో ఉత్పత్తి లక్ష్యం దెబ్బతింటుందని యాజమాన్యం కర్మికశాఖకు లేఖ రాసింది. దీంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆ తర్వాత కరోనా వ్యాప్తి లాక్ డౌన్‌తో మరుగున పడింది. ఇప్పుడు మళ్లీ సింగరేణి ఎన్నికల కోలాహలం మొదలైంది.

Updated Date - 2021-07-15T19:52:05+05:30 IST