సింగరేణి డైరెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2020-09-27T10:48:13+05:30 IST

సింగరేణి డైరెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

సింగరేణి డైరెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

కొత్తగూడెం, సెప్టెంబరు 26: సింగరేణిలో జీఎం (ఈఅండ్‌ఎం) అండర్‌ గ్రౌండ్‌ మైన్స్‌గా పని చేస్తున్న డి.సత్యనారాయణరావు డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) శనివారం హెడ్డాఫీసులోగల తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్‌ డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) ఎస్‌. శంకర్‌ వచ్చి పుష్ప గుచ్ఛాలు ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ... 130 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థలో డైరెక్టర్‌ పదవీలో నియమించినందుకు చాలా సంతోషంగా ఉన్నదని, తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అం దజేసిన సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌. శ్రీధర్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలి పారు. సింగరేణి పురోభివృద్ధికి సమష్టి కృషితో తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని తెలిపారు. 

Updated Date - 2020-09-27T10:48:13+05:30 IST