2021 డిసెంబరు నాటికి 130 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి

ABN , First Publish Date - 2020-11-28T06:47:40+05:30 IST

సింగరేణి కాలరీస్‌ రామగుండం-3 ఏరియాలో నిర్మిస్తోన్న 50 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్‌లో తొలిదశ 15 మెగావాట్ల ప్లాంట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. శుక్రవారం సింగరేణి డైరెక్టర్‌ సత్యనారాయణ స్విచ్‌ ఆన్‌ చేసి 15 మెగావాట్ల విద్యుత్తును 132 కె.వి. సబ్‌ ేస్టషన్‌కు అనుసంధానించారు

2021 డిసెంబరు నాటికి 130 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి

రామగుండం-3లో 15 మెగావాట్ల ప్లాంట్‌ గ్రిడ్‌కు అనుసంధానం

సింగరేణి కాలరీస్‌ వెల్లడి 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): సింగరేణి కాలరీస్‌ రామగుండం-3 ఏరియాలో నిర్మిస్తోన్న 50 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్‌లో తొలిదశ 15 మెగావాట్ల ప్లాంట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. శుక్రవారం సింగరేణి డైరెక్టర్‌ సత్యనారాయణ స్విచ్‌ ఆన్‌ చేసి 15 మెగావాట్ల విద్యుత్తును 132 కె.వి. సబ్‌ ేస్టషన్‌కు అనుసంధానించారు. సింగరేణిలో తొలిదశలో 130 మెగావాట్ల ప్లాంట్లను వివిధ ప్రాంతాల్లో పెడుతుండగా... ఇందులో ఇప్పటిదాకా 55 మెగావాట్లను గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. రామగుండం-3లో మిగిలిన 35 మెగావాట్లను, అలాగే ఇల్లందులో దాదాపుగా నిర్మాణం చివరి దశకు చేరిన 39 మెగావాట్ల ప్లాంట్లను ఈ డిసెంబరు నెలాఖరునాటికీ  ప్రారంభించాలని నిర్ణయించింది.


అలాగే రెండో దశలో 90 మెగావాట్ల ప్లాంట్లతో పాటు మూడో దశలోని 81 మెగావాట్ల ప్లాంట్ల కాంట్రాక్టులను ఇప్పటికే అప్పగించినందున వీటి నిర్మాణం 2021 డిసెంబరు నాటికి పూర్తి చేసి విద్యుదుత్పాదన ప్రారంభించాలని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. రామగుండం-3 ఏరియాలో నిర్మిస్తున్న 50 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం పూర్తయితే సింగరేణికి ఏటా రూ.17 కోట్ల వరకు విద్యుత్‌ బిల్లుల ఖర్చులు ఆదా కానున్నాయని తెలిపింది. 

Updated Date - 2020-11-28T06:47:40+05:30 IST