Singapore: సింగపూర్‌లో మనోడు చేసిన పని నెట్టింట వైరల్.. అంత కక్కుర్తి’ ఎందుకంటున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2022-09-14T01:56:18+05:30 IST

సింగపూర్‌లో నివసిస్తున్న భారత్‌(Indian-origin)కు చెందిన వ్యక్తికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసి నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అంత కక్కుర్తి’ ఎందుకూ అంటూ కామెంట్స్ చేస్తు

Singapore: సింగపూర్‌లో మనోడు చేసిన పని నెట్టింట వైరల్.. అంత కక్కుర్తి’ ఎందుకంటున్న నెటిజన్లు!

ఎన్నారై డెస్క్: సింగపూర్‌లో నివసిస్తున్న భారత్‌(Indian-origin)కు చెందిన వ్యక్తికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసి నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అంత కక్కుర్తి’ ఎందుకూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంతకూ అతడు ఎవరు? సింగపూర్‌లో ఏం చేశాడు? నెటిజన్లు అతడిని ఎందుకు తిడుతున్నారనే వివరాల్లోకి వెళితే..



జెశ్వేందన్ సింగ్(Jeswindar Singh) అనే వ్యక్తికి ప్రస్తుతం 61ఏళ్లు. ఇతడు సింగపూర్‌లో నివసిస్తున్నాడు. ఈ మహానుబావుడు గత నెల 26న ఓ ఘనకార్యానికి పాల్పడ్డాడు. తాను నివసిస్తున్న చోట దొంగతనానికి పాల్పడ్డాడు. షాప్‌లో ఎవ్వరూ లేని విషయాన్ని గమనించి.. ఫ్రిడ్జ్ నుంచి 3 సింగపూర్ డాలర్లు విలువ గల మూడు కోక్ క్యాన్‌(Coca-Cola)లను తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఫ్రిడ్జ్ డోర్ తెరచి ఉండటాన్ని గమనించిన షాపు యజమానులు.. అక్కడ రికార్డైన సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన అధికారులు.. జెశ్వేందర్ సింగ్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసుపై విచారణ జరిపిన అక్కడి న్యాయస్థానం.. 6 వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు(Singapore court) వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 


Updated Date - 2022-09-14T01:56:18+05:30 IST